Health & Lifestyle

బ్రొకోలీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....

KJ Staff
KJ Staff

చూడటానికి అచ్చం కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది బ్రోకలీ అయితే రెండిటి మధ్య ఎంతో వ్యతాసం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ బ్రొకోలీని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అధిక నీటిశాతం కలిగి ఉన్న బ్రోకలీ ఈ మండే ఎండలకు ఎంతో అవసరం, దీనిని ఈ వేసవికి సూపర్ ఫుడ్ గా కూడా పరిగణించవచ్చు. దీనిని ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. అయితే మిగిలిన కూరగాయలతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువుగా ఉంటుంది, కాబ్బటి దీనిని ప్రతిరోజు తినకున్న అప్పుడప్పుడు తిన్నాసరే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. బ్రొకోలీలోని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీఆక్సిడెంట్లు:

బ్రొకోలీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తయి, వీటి ద్వారా శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. మొదటిగా యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. బ్రొకోలీలోని బీటా కెరోటిన్ మరియు విటమిన్-సి యూవీ కిరణాల నుండి రక్షణ కల్పించి , అంతేకాకుండా ఇంఫ్లమేషన్ తగ్గించి, శరీరంలోని వాపును తొలగిస్తాయి. బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇమ్మ్యూనిటి:

బ్రొకోలీలోని, ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, మరియు ఇతర ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలపరచి రోగాల భారిన పడకుండా కాపాడగలవు. వేసవిలో ఇమ్మ్యూనిటి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వేసవిలో వీలైనన్ని ఎక్కువసార్లు బ్రొకోలీని తినడం మంచిది.

హైడ్రేషన్:

వేసవిలో వేడికి శరీరంలోని నీరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది, దీనివల్ల కళ్ళుతిరగడం, నీరసంగా ఉండటం, వడ దెబ్బకు గురికావడం వంటి పరిస్థితులు కలగవచ్చు. బ్రొకోలీలో నీటిశాతం ఎక్కువుగా ఉంటుంది, దీనిని ప్రతిరోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా రోజంతా హైడ్రేటెడ్గా ఉంచుతుంది, నీటితోపాటు ఇతర ఖనిజలు కూడా బ్రోకలీ నుండి లభిస్తాయి.

జీర్ణవ్యవస్థను పెంపొందిస్తుంది:

బ్రొకోలీలో పొట్టకు మేలు చేసే పీచు పదార్ధాలు ఎన్నో ఉంటాయి. ఈ పీచు పదార్ధాలు పొట్టలో మంచి బాక్టీరియా వృద్ధి చెందేలా చేసి పొట్ట పనితీరును పెంచుతుంది. అంతేకాకుండా ఎన్నో కడుపు సమస్యలను తొలగించడంలో కూడా బ్రొకోలి తోడ్పడుతుంది. మనం తీసుకున్న ఆహారంలో సర్రిగ్గా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More