Health & Lifestyle

ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ఆహారం తీసుకోండి....

KJ Staff
KJ Staff

ఒక టెంట్ నిలబడాలంటే, కర్రలు ఎంతవసరమో శరీరం నిలబడాలన్నకూడా ఎముకలు అంతే అవసరం. ఎముకలు శరీరానికి ఒక ఫ్రేంవర్క్ లాగా పనిచేసి, శరీరానికి సపోర్ట్ ఇస్తాయి. అయితే శరీరపనితీరు బాగుండాలన్న, మన ముందుకు కదలాలన్న ఎముకలు ఆరోగ్యంగా ఉండటం చాల ముఖ్యం. ఎముకలు బలహీనంగా ఉంటే ఒకచిన్న దెబ్బతగిలిన సరే ఎముకలు విరిగిపోయి ప్రమాదం ఉంటుంది. ఎముకల నిర్మాణంలో ప్రదాన పాత్రపోషించేది కాల్షియమ్, ఇది ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనికోసం కాల్షియమ్ ఎక్కువుగా ఉండే ఆహారని మన డైట్లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. కాల్షియమ్ తోపాటుగా ఎముకల ఆరోగ్యానికి దోహదపడే, ఇతర ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు కూడా ఆహారంలో చేర్చుకోవడం అవసరం.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోతూ వస్తుంది. దీనివలన ఎక్కువ బరువు మోయలేకపోవడం, మోకాళ్లనొప్పులు మరియు ఇతర సమస్యలతో పెద్దవారు భాదపడుతూ ఉంటారు. ఇటువంటి వారు కాల్షియమ్, ప్రోటీన్లు, విటమిన్-డి, మాగ్నెసియం, కలిగి ఉన్న ఆహారని తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, అయితే ఎటువంటి ఆహారంలో ఈ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆకుపచ్చ కూరగాయలు ముఖ్యమైన పాత్రపోషిస్తాయి. వీటిలో బ్రోకలీ, కొల్లార్డ్ గ్రీన్స్, బచ్చలి కూర ఆకులు మరియు మెంతి ఆకులు ఉన్నాయి. వీటన్నిటిలో కాల్షియమ్, మాగ్నెసియం మరియు విటమిన్-కే సంవృద్ధిగా లభిస్తాయి. బలహీనమైన ఎముకల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఈ సమస్యను పరిష్కరించడంలో విటమిన్-కే ఎంతగానో సహాయపడుతుంది. దీనితోపాటు మాగ్నెసియం ఎముకులను బలంగా మారేలా చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల ద్వారా లభించే కాల్షియమ్ ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడుతుంది.

ఎముకలు బలంగా ఉండటానికి, ఖనిజాలతోపాటు, ప్రోటీన్లు మరియు విటమిన్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డ్రైఫ్రూప్ట్స్ లో శరీరానికి అవసరమైన, ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నుట్, బాదాం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రైఫ్రూప్ట్స్ ప్రతిరోజు తినడం వలన ఎముకల సాంద్రత మెరుగుపడి పగుళ్లు వచ్చే అవకాశం తక్కువుగా ఉంటుంది. అయితే డ్రైఫ్రూప్ట్స్ ఎంతో ఖరీదైనవి కాబట్టి వీటిని ప్రతిరోజూ తినడం కష్టం కాబ్బటి వీటికి ప్రత్యామ్న్యాయంగా చియా గింజలు, ఫ్లక్స్ సీడ్స్, పుచ్చకాయ మరియు ప్రొద్దుతిరుగుడు గింజలను తినడం ఉత్తమం. వీటిలో కూడా కాల్షియమ్, మెగ్నీషియం మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకులు ధృడంగా మారడానికి తోడ్పడతాయి.

ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్-డి ఎంతో సహాయం చేస్తుంది. ఈ విటమిన్- డి మన శరీరం ఉత్పత్తి చేసుకునే సామర్ధ్యం ఉంది, అయితే వయసు పెరిగేకొద్దీ విటమిన్-డి తయారుచేసుకునే సామర్ధ్యం తగ్గుతూవస్తుంది. అయితే కొన్ని ఆహార పదార్ధాల ద్వారా కూడా విటమిన్-డి పొందవచ్చు. సాల్మన్, ట్యూనా, వంటి కొవ్వు చేపల్లో ఈ విటమిన్-డి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పాలు, జున్ను, ఛీస్ ఇవన్నీ కూడా కాల్షియమ్ వనరు కే=పుష్కలంగా కలిగి ఉంటాయి కాబట్టి వీటిని తరచు ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటాయి.

Related Topics

#health #Bone #Calcium #magnesium

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More