Horticulture

<<డ్రాగన్ ఫ్రూట్ పంట! ఇంక లాభాలు మీ వెంట>>

KJ Staff
KJ Staff

అందరికి సుపరిచితమైన పండ్ల రకాలలో డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి. సెంట్రల్ అమెరికా లో పుట్టిన ఈ పండు ఇప్పుడు మన ఇండియా లోను 3,000 కంటే ఎక్కువ ఎకరాలలో సాగు చెయ్యబడుతుంది. మంచి ఆర్యోగ్యని ఇచ్చే గుణంలోనే కాకుండా దీనిని పండించే రైతులకు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. తక్కువ కెలోరీలు ఉండటం మూలాన షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా ఈ టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. అంతే కాకుండా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా మన శరీరానికి అందించి రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకుందాం రండి.

అనువైన వాతావరణం;

భిన్నమైన వాతావరం లో పెరిగే సామర్ధ్యం ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్, వివిధ నెల పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. మన దేశం లో ముఖ్యం గ కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళ్ నాడు ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చెయ్యబడుతుంది. ఇంకా వాతావరణ పరిస్థితుల గురించి చూస్తే 25 C నుండి 30 C వరకు మొక్క ఎదుగుదలకు అనువుగా ఉంటుంది. స్వల్ప ఆమ్లా తత్వం ఉన్న నెలలు అనుకూలం.

వెరైటీలు;

తెల్ల రంగు గుజ్జు ఉన్న రకాలను (హైలోసెర్స్ ఉదంటూస్ ) అని అలాగే ఎర్ర రంగు గుజ్జు ఉన్న రకాలను (హైలోసెర్స్ పోలీరిజిస్ ) అని పిలుస్తారు. అంతే కాకుండా అక్కడక్కడ పసుపు రంగు ఉన్న డ్రాగన్ ఫ్రూప్ట్స్ ని పండిస్తూ ఉంటారు వాటిని హైలోసెర్స్ మెగాలంతున్ అని పిలుస్తారు బ్లడీ మేరీ, రెడ్ పితాయా,అమెరిల్లా, డిలైట్ వంటివి కొన్ని బాగా తెలిసిన వెరైటీలు.

మొక్కలు నాటడం:

సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కాండం నుండి వచ్చే పిలకలు నుండి అభివృద్ధి చేస్తారు. డ్రాగన్ ఫ్రూట్ అధిక సూర్యరశ్మిని ఆశిస్తుంది, రోజుకు సుమారు 12 గంటల సూర్యరశ్మి అవసరం కాబట్టి ఓపెన్ ఏరియాస్ లో మొక్కలని పెంచవలసి ఉంటుంది. ప్రతి మొక్కకి సుమారు 20 నుండి 25 సెంటీమీటర్ల దూరాన్ని ఉంచవలసి ఉంటుంది. జులై ఇంకా ఆగష్టు నెలలు మొక్కలు నాటేందుకు వాతావరణం అనుకూలం గ ఉంటుంది. మొక్క తనంతట తాను నిలబడదు అందుకుగాను ప్రతి నాలుగు మొక్కలకు 1.5- 2. 0 అడుగుల సిమెంట్ పోల్ ను పాతవలసి ఉంతుంది'. ఈ పోల్ మొక్క ఎదిగే సమయం లో సహాయపడుతుంది.

పోషకాల నిర్వహణ;

అవసరం అయిన నీటితో పటు మొక్క ఎదుగుదలకు అవసరం అయ్యే ఎరువులు కూడా సరిఅయిన సమయం లో అందించవలసి ఉంటుంది. ప్రతి ఏటా 500gm నత్రజని, 400gm భాస్ఫారమ్, 350gm ఒక్క మొక్క చొప్పున అందించవలసి ఉంటుంది..

నీటి అవసరం:
డ్రాగన్ ఫ్రూట్ మొక్క యొక్క వేర్లు భూమిలో సుమారు 30 మీటర్ల లోతున ఉండటం వాళ్ళ పంట కి నీరు అందించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం మంచిది. దీని ద్వారా మొక్కకు కావలసిన నీరు అందడమే కాకుండా నీటి వృధా ని కూడా తాగిస్తుంది. మట్టి తేమను బట్టి వారానికి రెండు సార్లు నీటిని అందించవలసి ఉంటుంది.

హార్వెస్టింగ్ విధానం:

డ్రాగన్ ఫ్రూట్ పంట వేసిన ఒక ఏడాది తర్వాత పంట హార్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. జూన్ మరియు సెప్టెంబర్ నెలల్లో పంట చేతికి వస్తుంది . ఒక హెక్టార్ కు సుమారు 8-10 టన్నుల పంట రైతులు పొందవచ్చు. ఒక హెక్టర్ కు 4,0000 పెట్టుబడితో 5,0000 నుండి 6,0000 వరకు ఆదాయం

Share your comments

Subscribe Magazine