Horticulture

వర్షధార పంటగా గోరుచిక్కుడు... ఎలాగో తెలుసుకుందాం రండి .....

KJ Staff
KJ Staff

తీవ్రమైన కరువుపరిస్థితులను పరిస్థితులను తగ్గుకోగలిగే పంటలు ఏమిటంటే వెంటనే అందరు చిరుధాన్యాల పేరు చెబుతారు. అయితే కూరగాయ పంటలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు చాలా తక్కువుగా ఉంటాయి. గోరు చిక్కుడు తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకోగలిగే కూరగాయపంట. వర్షాభావ పరిస్థితులతో పాటు అధిక వేడిని కూడా తట్టుకోగలిగే పంట గోరు చిక్కుడు. గోరు చిక్కుడు గింజల నుండి తయారయ్యే జిగురును బట్టలు, పేపర్, మరియు సౌందర్య సాధనాల తయారీలోనూ వాడతారు.

గోరు చుక్కుడు మొక్కలు ఎదిగాక వాటి కొమ్మలను పచ్చిమేతగా పశువులకు వాడతారు, దీని గింజలను పశువులకు దాణాగా వాడవచ్చు అలాగే దీనిని పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి భూసారాన్ని కూడా పెంచవచ్చు. ఇలా బహుళప్రయోజనాలు కలిగిన గోరుచిక్కుడు సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోరు చిక్కుడు ఉష్ణమండలాలకు అనువైనది, తీవ్రమైన చలిని మరియు మంచును తట్టుకోలేడు. తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాల్లో సులభంగా సాగు చెయ్యవచ్చు. గోరు చిక్కుడు పంటకు దాదాపు అన్ని నేలలు అనుకూలమైనవే, అయితే మురుగునీరు నిలువ ఉండే నేలలు అధిక సాంద్రత కలిగిన బరువైన నేలలు, మరియు క్షార నేలలు పనికిరావు. ఎర్రగారప మరియు ఒండ్రు నేలలు, ఉదజని సూచిక 7.5 నుండి 8.0 మధ్య ఉండే నేలలు సాగుకు అనుకూలిస్తాయి.


గోరు చిక్కుడు ఖరీఫ్ మరియు వేసవి పంటగా సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్ పంటగా సాగు చేస్తే జూన్ మొదటివారం నుండి జులై రెండో వారం వరకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వేసవి పంటగా సాగు చేసే రైతులు జనవరి రెండో వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తేందుకు వాతావరణం అనుకూలిస్తుంది. ఒక ఎకరానికి 12-16 కిలోల విత్తనం సరిపోతుంది, రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటించాలి. విత్తుకునే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి, దీనికోసం ఒక కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోరోఫిడ్, 8 గ్రాముల త్రికోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేపట్టాలి.

గోరుచిక్కుడు సాగుకు కాలువలు, బోదె పద్ధతి అనుకూలిస్తుంది. వర్షాకాలంలో సాగు చేసే రైతులు వర్షపు నీరు బయటకి పోయే విధంగా బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. జూన్లో తొలకరి చినుకులు పడగానే నేలను, గుల్లబారెవరకు దున్నుకోవాలి, నేలను దున్నిన తరువాత గట్లను ఏర్పాటు చేసుకొని, వాటిపై 60 సెంటిమీటర్ల దూరంలో విత్తనాలను నాటుకోవాలి. వేసవికాలంలో కాలంలో సాగు చేస్తే మొక్కల సాంద్రత ఎక్కువుగా ఉండే విధంగా విత్తుకోవాలి.

గోరు చిక్కుడు తీర్వ కరువు పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడగలదు, అయితే మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అవసరమైన మేరకు అందించాలి. మట్టిని చదును చేసే ముందు 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. దీనితోపాటుగా ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ ఎరువులను అవసరం ఉంటుంది. భాస్వరం మరియు పొటాషియం ఎరువులు మొత్తని విత్తుకునే సమయంలో వెయ్యాలి, నత్రజని ఎరువుల్లో సాగ భాగం విత్తుకునే సమయంలో వేసి, మిగిలిన భాగం విత్తనం నాటిన 30-40 రోజుల మధ్యలో వాడాలి.

గోరు చిక్కుడు సాగులో వచ్చే కలుపు నివారణకు అంతకృషి చేపట్టాలి. కలుపు సమస్య ఎక్కువుగా ఉన్నట్లైతే పెండిమిథాలిన్ ఒక ఎకరానికి 1.25 మిల్లిలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చెయ్యాలి. తేలిక నేలల్లోని కలుపుకు అలాచేలా బాగా పనిచేస్తుంది దీని కోసం 1 మి.లి అలాక్లోర్ ఒక లీటర్ కలిపి పిచికారీ చెయ్యాలి. గోరు చిక్కుడు వర్షాభావ పంటగా సాగు చేస్తారు, వేసవిలో వర్షపాతం తక్కువుగా ఉంటుంది కాబట్టి, గింజలు విత్తగానే మొలకెత్తేందుకు వీలుగా నీటిని పారించాలి. సాగునీటి లబ్యత ఉన్నచోట్ల ఒకట్రెండు నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు నాటిన 100-120 రోజుల్లోగా పంట చేతికి అందివస్తుంది. ఒక ఎకరానికి దాదాపు 5-6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

Share your comments

Subscribe Magazine