మన దేశంలోని ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు వర్షాల మీదే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు పంటల సాగుకి అవసరమైనప్పటికీ, అధిక వర్షాలు పంట నష్టాన్ని మిగల్చవచ్చు, అధిక వర్షాలకు పొలంలో నీరు నిలిచి మొక్కలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. వర్షాలకు గాలిలో తేమ శాతం పెరిగి చీడపీడలు ఆశించడానికి ఎంతో ఆస్కారం ఉంది. తోటల్లో ఈ వర్షపు నీరు బయటకు పోవడానికి మార్గం లేకుంటే నీరు తోటలో నిలిచి వేరు కుళ్ళు మొదలైన తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది.
కేవలం వేసవికాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మామిడి పంట. మామిడి సాగు చేసే రైతులు సంవత్సరానికి ఒక్కసారే దిగుబడి సాధించిన సరే, సంవత్సరం మొత్తం, పంట రక్షణ చర్యలపై ద్రుష్టి సారించాలి, లేకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మరీముఖ్యంగా వర్షాకాలంలో రైతులు అనేక రక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షం తగ్గిన వెంటనే ,వీలైనంత తొందరగా పొలంలో నుండి నీటిని బయటకు మరల్చాలి. నీరు ఎక్కువుగా నిలబడటం వలన మొక్కలు చనిపోయే అవకాశం ఉంది, లేత తోటల్లో చనిపోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటుకోవాలి. ఒక్కసారి బలమైన గాలులతో కూడా వర్షం కురవడానికి అవకాశం ఉంటుంది, అటువంటి సమయంలో కొన్ని చెట్లు వేర్లతో సహా నెలకొరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు ఈ చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి, చెట్లకు ఊతమివ్వాలి.
అధికంగా నీరు నిలిచిపోవడం కారణంగా మొక్కలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే బూస్టర్ డోస్ అందించాలి. దీనికోసం ప్రతి చెట్టుకు 500 గ్రాముల యూరియా, 400 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్, మరియు 25 కిలోల పశువుల ఎరువును వెయ్యాలి. వర్షం నీరు నిలిచిపివడం కారణంగా అనేక రకాల తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది వాటిలో మొదటిది వేర్లకు వచ్చే తెగుళ్లు, వీటిని నివారించడానికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల మోడళ్లలో మట్టి మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి. దీనితోపాటుగా, ఆకుల మీద ఏర్పడే పక్షి కన్ను తెగులు మరియు కాయ కుళ్ళు తెగులు ప్రధానంగా కనిపించే తెగుళ్లు వీటిని సమగ్రవంతగా నివారించడానికి కార్బెన్డిజిమ్ 1 గ్రా ఒక లీటర్ నీటికి కలిపి ఆకులపై మరియు పిచికారీచేయ్యాలి.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువుగా ఉంటుంది, దీని వలన పురుగుల ఉదృతు పెరుగుతుంది. వీటిలో ప్రధానమైనది పండు ఈగ, దీనితోపాటు ఎన్నో రకాల పురుగులు మొక్కలను ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిని నివారించడానికి డైమిథోయతే లేదా క్లోరోపైరిఫోస్
2.5 మీ.లీ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై 15 రోజులకు ఒకసారి పిచికారీ చెయ్యాలి. వర్షాలకు పిందెరాలే అవకాశం ఎక్కువుగా ఉంటుంది, దీనిని నివారించడానికి ప్లానోఫిక్ రెండు గ్రాములు ఒక 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
Share your comments