Horticulture

మామిడి పండ్ల దిగుబడిలో తగ్గుదలకు కారణాలు.... వాటి నివారణ చర్యలు.....

KJ Staff
KJ Staff

వేసవి కాలనీ మామిడి కాలంగా కూడా పిలవచ్చు. కేవలం వేసవి కాలంలోనే మాత్రమే మామిడి కాయలకు, మరియు పళ్ళు విరివిగా లభ్యమవుతాయి. పండ్లలో రాజుగా పిలవబడే మామిడి పళ్ళను మన తెలుగు రాష్ట్రాల ప్రజలు పచ్చాలకు, కూరలకు, మరియు కొన్నిం స్వీట్ల తయారీలోనూ వాడతారు.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడి పళ్లను కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశ ప్రజలు కూడా ఇష్టపడతారు. కానీ రైతులకు మాత్రం మామిడి పంట యాజమాన్యం కత్తి మీద సాము వంటిది. మామిడి పంట రైతులు, ఎదుర్కొనే అనేక సమస్యల్లో, దిగుబడి తగ్గిపోవడం ఒకటి. కొన్ని యాజమాన్య పద్దతుల ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు.

మామిడి చెట్లు ఉష్ణమండల పర్యాంతల్లో అధికంగా పెరుగుతాయి. కొండ ప్రాంతాలు మామిడి చెట్ల పెంపకానికి అనువుగా ఉండవు. మన భారత దేశంలో, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒర్రిస్సా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో విరివిగా సాగుచేస్తారు. కొన్ని ఘనకాల ప్రకారం ఇండియా మొత్తం మీద 2,460 వేల హెక్టర్లలో, మామిడి పళ్ళను సాగుచేస్తున్నారు. 17,290 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది.

మామిడి చెట్లలో దిగుబడి తగ్గిపోవడం ప్రస్తుతం రైతులను ప్రధానంగా వేధిస్తున్న సమస్య, ఒక సంవత్సరం కాపు బాగా కాస్తే దాని తరువాతి సంవత్సరం, కాయ దిగుబడి తగ్గిపోవడం రైతులు గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం చెట్టు లోని జన్యులోపామని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అయితే ఈ సమస్యను అరికట్టడానికి, అనేక రకాల మామిడి చెట్లను ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెయ్యడం జరిగింది. అభివృద్ధి చెయ్యబడిన రకాలను వాడటం ద్వారా ప్రతీ సంవత్సరం మంచి దిగుబడిని పొందవచ్చు. మార్కెట్లో దొరికే హైబ్రిడ్ రకాలను సాగుచేయడం ద్వార అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యమైన పంటను పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

సాధారణంగా ఒక మామిడి చెట్టు నాటిన నాటి నుండి నాలుగు సంవత్సరాల తర్వాత కాయలు కాయడం ప్రారంభమవుతుంది. కాయ దిగుబడి ప్రతీ ఏడాది తగ్గకుండా, దిగుబడి పెరిగేందుకు, సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం అవసరం. ప్రతి చెట్టుకు కనీసం 550 గ్రాముల డిఎపి(DAP), 850 గ్రాముల యూరియా, 750 గ్రాముల ఎంఓపి (MOP) అందించడం అవసరం. మెరుగైన యజమాన్య పద్దతుల ద్వారా ఒక చెట్టునుండి కనీసం 1000-3000 వరకు కాయలు దిగుబడి పొందవచ్చు.

కొన్ని ప్రాముఖ్యమైన రకాలు:

ఆంధ్ర ప్రదేశ్ : బంగినపల్లి, బెంగుళూరు, స్వర్ణరేఖ, మల్గొవ, హిమయుద్దీన్.

తమిళనాడు: బెంగుళూరు, బంగినపల్లి, రుమని, నీలం.

కర్ణాటక: అల్ఫోన్సో, మల్లికా, పత్రి, నీలం, బెంగుళూరు,

ఉత్తర్ ప్రదేశ్: దాసేహరి, లంగరా, చౌస, బొంబాయ్ గ్రీన్, రతుల్ , లక్నో సఫిదా, ఆమ్రపాలి.

బీహార్: బాంబియ, గులాబ్ ఖాస్, మిత్వా, మాల్డా, కిసాన్ భోగ్, లంగడ, హింసాగర్, చౌస, ఆమ్రపాలి.

గుజరాత్: కేసర్, రాజపురి, అల్ఫోన్సో, జమదర్.

మహారాష్ట్ర: ఆఫోన్సో, కేసరి, పైరీ, మేల్గో.

ఒర్రిస్సా: ఆమ్రపాలి, దుస్సేహ్రి, లాంగ్డ, స్వర్ణరేఖ, నీలం.

వెస్ట్ బెంగాల్: హింసాగర్, మాల్డా, ఫాజిల్, కిషన్భోగ్, రాణి పసంద్, బొంబాయి, ఆమ్రపాలి.

Share your comments

Subscribe Magazine