Horticulture

డ్రాగన్ ఫ్రూట్ నిర్వహణ పద్దతులు

KJ Staff
KJ Staff

అనేకమైన పోషక విలువలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో విశిష్టమైన ప్రాధాన్యత పుంజుకుంది. ఆశాజనకమైన లాభాలు రావడం వాళ్ళ రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడికి శ్రమ తోడయితే ఈ పంట నుండి మంచి లాభాలు పొందవచ్చు. అయితే డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఊహించిన రీతిలో ఆదాయం పొందవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ సాగు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

ఎల్ఈడి లైట్స్ వినియోగం:

డ్రాగన్ ఫ్రూట్ మొక్కను లైట్ లొవింగ్ ప్లాంట్ అని కూడా అంటారు అంటే ఈ మొక్క పువ్వులు పుయ్యడాయినికి కాయలు కాయడానికి అధిక కాంతి కావాలి అని అర్ధం. కనుక మే నుండి అక్టోబర్ నెల వరకు పళ్ళ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని పొడిగించి సంవత్సరం పొడవునా దిగుబడి పొందేందుకు ఎల్ఈడి లైట్లను ఉపయోగిస్తారు. ఈ ఎల్ఈడి లైట్ల ద్వారా సూర్యరశ్మి ఎక్కువ ఉండే నెలలే కాకుండా మొత్తం సంవత్సరం అంత మొక్కకు అవసరం అయినా కాంతి ని అందించవచ్చు. తద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

కలుపు నివారించుట:
తరచూ కలుపు మొక్కలని నివారించడం ద్వారా మట్టిలోని తేమ శాతాన్ని పెంచి మొక్కకి అవసరం అయినా నీటిని అందించడానికి వీలుగా ఉంటుంది. కలుపు నియంత్రణ మొక్కల మధ్య పోటీ తగ్గి అధిక దిగుబదిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.

 

మొక్కని ఆశించే రోగాలు:

బూజు తెగులు: 2g మాంకోజెబ్ ను ఒక లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిసీకారి చెయ్యాలి లేదా 1g కార్బెడిజిమ్ ను ఒక లీటర్ నీటిలో కలిపి చల్లాలి.

ఆకు మచ్చ తెగులు: రోగానికి గురి అయినా మొక్కలు తొలగించి ఏమైనా కాపర్ సిలింద్రనాశిని పిచికారీ చెయ్యాలి

Share your comments

Subscribe Magazine