Horticulture

బంతి సాగులో మెళకువలు

Desore Kavya
Desore Kavya
Marigold cultivation
Marigold cultivation

మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతూ , వాణిజ్య పరంగా పండించే విడిపూల పంటలలో ప్రదానమైనది బంతి . బంతి పూల వాడకం వరలక్ష్మీవ్రతం నుండి మొదలుకొని దసరా , దీపావళి సంక్రాంతి మరియు వివిధ జాతరలు , శుభకార్యాల సమయంలో మార్కెట్ గిరాకల చూసుకొని ఏడాది పొడువునా బంటని సాగుచేసి నట్లుంటే అధిక ఆదాయాన్ని పొందవచ్చు . ఈ బంటి పూలు ఆకర్షణీయంగా వివిధ రంగులు , ఆకారాలతో ఉండడంతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లని ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు వీటిని సాగుచేసుకోడానికి అవకాశాలు ఎక్కువ.

నేలలు

  బంతిని అన్ని నేలల్లో సాగు చేసినప్పటికీ సారవంతమైన గరపనేలలు అత్యంత అనుకూలమైనవి . మురుగు నీటి వసతి ఉన్నచో బరువైన నేలల్లో కూడా బంతిని సాగు చేయవచ్చు . నేల ఉదజని సూచిక 7-15 వరకు ఉంటే మంచిది .

 మతావరణం :-

బంతిని  వాతావరణ పరిస్థితులని బట్టి ఏడాది పొడువును సాగుచేయవచ్చు . ఉ 14-28  డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతుంది . 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ లేదా 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత  ఎక్కువున్నా పూలపై తీవ్ర ప్రభావం చూపుతుంది . నీడ ప్రదేశాలను బంతి సాగుకు అనుకూలం కాదు . దీని వల్ల మొక్కలు పూలు పూయక, శాఖీయ దశలోనే ఉండిపోయాయి.

రకాలు : సాధారణంగా ఆఫ్రికన్ మరియు ఫ్రెంచి రకాలు మ్యుమైనవి  వాణిజ్య పరంగా

ఆఫ్రికన్ బంతి రకాలకు  గిరాకీ ఎక్కువ . ఇవి ప్రదానంగా పసుపు , నారింజ రంగులతో ముద్దగా ఉండే పూలు కావున , వీటికి మార్కెట్ విలువ ఎక్కువ . ఈ మొక్కలు ఎత్తుగా , ఏపుగా పెరిగి  పెద్ద పూలనిచ్చే రకాలు . పూసా నారింగ గైండా , పూసా బసంతి గైండా , అర్కా బంగార (పసుపు), మరియు అర్కా అగ్ని (నారింజ) అర్కా బంగార -2 మంచి దిగబడినిస్తున్నాయి . అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చేసుకోవచ్చు . ఈ రకాలలో విత్తనం ఉండదు.  ప్రైవేట్ సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి.

ఫ్రెంచ్ బంతి :

ఈ రకం మొదలు పొట్టిగా ఊడి దృడంగా సింగిల్ లేక డబుల్ పువ్వులను  కలిగి ఊడి ఆఫికన్ బంతి రకాలకన్నా త్వరగా కోతకు వస్తాయి . అర్క పరి , అర్క  హని రకాలు మంచి దిగుబడినిస్తున్నాయి .

నారు పెంపకం:-

వాణిజ్య పరంగా ఆ బంతిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి సరిపడానారు పెంచడానికి 800 గ్రాము విత్తనం  అవసరమవుతుంది . మొలకశాతం బాగా   ఉంటే ఎకరానికి 400 – 500 గ్రాము విత్తనం సరిపోతుంది. నారు పెంచడానికి 15cm ఎత్తు 1 మీ  వెడల్పు ఉన్న మడులను చేసుకొని , ఒక చదరపు మీటర్ మడికి 8-10 కిలోల పశువుల ఎరువు తో మట్టి వేసి వెంటనే బాగా కలపాలి .  బెల్ల విత్తనాలను కాసించు దూరంలో వరుసలలో వేసుకోవాలి . విత్తనాలు వారంలో  మొలకెత్తుతాయి . విత్తనాలను ప్రోటెలలో నాటినట్లుయితే బలమైన నారు మొక్కలను తయారు చేసుకోవచ్చు .25-30 దజుల, 3-4 ఆకులు కలిగిన నారును ప్రధానపాలంలో నాటుకోవాలి.

నాటుకొనే సమయం:-

బంతిని అన్ని కాలాలకు సాగుచేసినప్పటికీ , ఒకనెల తేడాలో జూలై మొదటి వారం నుండి ఫిబవరి మొదటి వారం వరకు నాటుకుంటే మార్కెటకు సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు పూలు సరఫరం చేయవచ్చు. సాధారణంగా సెప్టెంబర్ , అక్టోబర్లో నాటుకున్న పంట నుండి మంచి నాణ్యమైన పువ్వులు మరియు విత్తనాలు కూడా పొందవచ్చు .

నాటుకొనే దూరం :-

ఆఫ్రికన్ రకాలు 60x 45 సెం.మీ

ఫ్రెంచ్ రకాలు 20 X 20 సెం.మీ

మల్చింగ్, డ్రిప్  విధానంలో సాగుచేసుకొనే వారు 15 సెం.మీ  ఎత్తు , 3 ఫీట్ల మొల్పుగల బెడ్ లపై 60 x 45 సెంమీ 60x60 సెంమీ దూరంలో త్రీకోణాకారంలో నాటుకోవాచ్చు .

ఎరువుల యాజమాన్యం:-

ఆఫ్రికన్ దుక్కిలో ఎకరానికి 8-10 టసుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి . వీటితో పాటు ఎకరానికి 30-40 కిలోల నత్రజని , 80 కేజీల భాస్వరం మరియు 80 కిలోల పొటాష్  నిచ్చే ఎరువు వేసి దున్నుకోవాలి . మొక్కలు నాటుకొన్న 30 రోజుల తర్వాత మరో 40 కిలోల నత్రజనిచ్చే ఎరువులను పై పాటంగా వేసుకోవాలి.

నీటి యాజమాన్యం :-

బంతి మొక్కలు అన్ని దశాల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి . మొక్క ఏ నైదశాల్లోనా నీటకి ఎద్దడికి గురయినట్లయితో మొక్క పెరుగుదల మరియు పూత దెబ్బతింటుంది .

బంతి పూల సాగు డ్రిప్, మల్చింగ్ విధానం ద్వారా సాగు చేసుకోవడం వల్ల సాగుఖర్చు , నీట వాడకం తగ్గుతుంది . మరియు మల్చింగ్ వల్ల కలుపు పెరగకుండా నివారించుకొని కలుపు నివారణలు అయ్యిఖర్చును ఆదా చేసుకోవచ్చు .

కలుపు యాజమాన్యం :-

వర్షాకాలంలో బంతిపూల సాగులో కలుపు బెడదా అధికంగా ఉంటుంది . పంట కాలంలో 3-4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలీ. కలుపు నివారించక పోతే బంతి మొక్కలలో పోషకాలు నీటికోసం పోటీపడి బంతి పూల దిగబడిని , నాణ్యతను తగ్గిసాయి.

తలలు తుంచడం:-

సాధారణంగా బంతి మొక్కలు ఒక ప్రధానకారణంతో ఏపుగా పెరుగుతాయి .ఆ తరువాత శాఖలు ఏర్పడతాయి . అందువల్ల మొక్కలు నాటిన 30 - 10 రోజులకు తలలు తుంచడం అనగా ప్రధాన కాండం చివర 2-3 సెం.మీ భాగాన్ని తుంచివేయడం చేయడం వల్ల ప్రధాన కాండం పెరుగుదల ఆగిపోయి , పక్క నుంచి కొత్త కోమటలు ఏర్పడుతాయి . ఈ కొమ్మలలో మొక్క మంచి ఆకారంతో పెరుగుతుంది . ఎక్కువ మోతాదులో ఒక పరిమాణంలో పూలు వస్తాయి . హైబ్రిడ్ వైవిధ్యాలలో తలాలు తుంచాడమ్ 20 రోజుల్లో చేయాలి.

పూలకోత :-

పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలయ్యి మొదటి కోత నుంచి మంచి రెండు లేదా రెండున్నర నెలల వరకు పూత వస్తుంది . పూలను 3-5 రోజులకొకసారి తీసుకోవచ్చు . పువ్వులు బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంతం వేళల్లో కోయడం మంచిది . పువ్వులకు ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఎక్కువకాలం నిల్పడటాయి . కోసిన తరువాత పువ్వులను తడిసిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డును కప్పి మార్కెట్ తరలించాలి .

పూల దిగుబడి :

సాధారణంగా  ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4-5టన్నులు హైబ్రిడ్ రకాలు 6-8 టన్నులు పూల దిగుబడినిస్తాయి . పైన  పేర్కాన విధంగా మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు .

డా || వి . చైతన్య , డా || జే . హేమంత కుమార్ , డా ॥ పి . శ్రీరంజిత్ , డా ॥ కె . రవికుమార్ ,

డా || P. జెస్సీసునీత మరియు ఎమ్. ఫణితో

కృషి విజ్ఞాన కేంద్రం , వైరా

Share your comments

Subscribe Magazine