Horticulture

టెర్రస్ గార్డెన్ లో ఈ మొక్కలు పెంచండి.

KJ Staff
KJ Staff
pappaya
pappaya

1. బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. నీళ్లు, కార్బొహైడ్రేట్లు, కొద్ది మొత్తంలో ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇందులో మూడు రకాల మొక్కలుంటాయి. ఆడ, మగ మొక్కలు వేర్వేరుగా కొన్నింట్లో ఉంటే ఆడ,మగ కలిసి ఉన్న మొక్కలు కూడా కొన్ని ఉంటాయి. ఇలా రెండు కలిపి ఉన్న మొక్కలు కొనడం మంచిది. వీటిని పెంచేందుకు మంచి నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎండ ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి.

2. జామ

ఈ మొక్కలు దేశంలో ఎక్కడైనా పెరుగుతుంది. ఎలాంటి వాతావరణంలో అయినా పెరగగలిగే మొక్క ఇది. జామలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని పెంచేందుకు నేలలో పీహెచ్ 6 నుంచి 7.5 ఉండేలా చూసుకోవాలి. వెడల్పాటి కుండీల్లో దీన్ని పెంచితే సంవత్సరం మొత్తం పండ్లు పండుతుంది. చిన్నగా ఉన్నప్పుడు రోజూ నీళ్లు పోయాల్సి ఉంటుంది. సరైన ఫర్టిలైజర్లు కూడా అందించాలి. కాస్త పెద్దదై పండ్లు ఇవ్వడం ప్రారంభిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు పండ్లు అందిస్తుంది.

Lemon Tree
Lemon Tree

3. నిమ్మ

నిమ్మలో చాలా రకాలుంటాయి. నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఇది సంవత్సరం మొత్తం పండ్లు అందిస్తుంది. కాస్త మధ్యస్థంగా ఉన్న కుండీలో దీన్ని పెంచుకోవచ్చు. మరుగుజ్జు నిమ్మను ఎంచుకుంటే మరీ మంచిది. నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని చేర్చడం వల్ల వంటకాల రుచి మరింత పెరగుతుంది. నీరు ఎక్కువగా నిలువ ఉండని నేలలు దీనికి అవసరం. తగినంత నీటిని దీనికి అందిస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ కొమ్మలను ట్రిమ్ చేస్తూ ఉండాలి.

4. మామిడి

పండ్లలో రాజుగా మామిడిని చెబుతారు. మీ టెర్రస్ గార్డెన్ లో కూడా దీన్ని సులువుగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కను పెంచేందుకు కంటెయినర్ కాస్త పెద్దగా ఉండాలి. నీళ్లు కుండీలో నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేళ్లు లోపలికి వెళ్లడానికి వీలుగా మెత్తని నేలను ఎంచుకోవాలి. నీళ్లు ఎక్కువగా అందించాలి. మొక్క కాస్త పెద్ద పెరిగే వరకు కాస్త జాగ్రత్తలు వహించాలి. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి వీటిని సంవత్సరం మొత్తం భద్రపర్చుకోవచ్చు.

DrumStick Tree
DrumStick Tree

5. మునగ

సాధారణంగా భూమిలో ఈ మునగ మొక్కలను పెంచితే ముప్ఫై నుంచి నలభై అడుగుల వరకు పెరుగుతుంది. కానీ టెర్రస్ మీద పెంచాలంటే మరుగుజ్జు మొక్కలను పెంచుకోవచ్చు. మునగ కాయలు చాలా పోషకాలు నిండి ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి, బి, ప్రొటీన్, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కాయలే కాదు.. ఆకులు కూడా చాలా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కను పెంచేందుకు పెద్ద కుండీ ఉండాలి. బంక, ఇసుక మట్టిల మిశ్రమాన్ని దీనికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో గొంగళి పురుగులు, ఎఫిడ్స్ ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అయితే దీనికోసం సహజమైన పురుగు మందులు ఉపయోగించడం మంచిది.

6. మందారం

ఎరుపు, పీచ్, ఆరెంజ్, పింక్, పర్పుల్, పసుపు రంగుల్లో లభించే మందారం ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా కనిపించే మొక్కల్లో ఒకటి. ఈ పూలు ఇంటి గార్డెన్ అందాన్ని మరింత పెంచుతాయి. దీన్ని చిన్న చిన్న కుండీల్లో పెంచడం చాలా సులువు. రెగ్యులర్ గా నీటిని అందిస్తూ ఉంటే పెరుగుదల బాగుంటుంది. మీలీ బగ్ అనే పేను సమస్య దీన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగులో కాండాలు కనిపిస్తుంటే ఆ భాగాన్ని కట్ చేసి వేపనూనె, సబ్బు ద్రావణం కలిపి కొట్టాలి. తేమ ఎక్కువగా ఉండే నేలలు దీనికి అవసరం. దీనికి ఆర్గానిక్ ఎరువులు వేయడం మంచిది. లిక్విడ్ ఫర్టిలైజర్ వేయడం, ఫాస్పరస్ వేయడం, చలికాలంలో ట్రిమ్ చేయడం వంటివి చేస్తుండాలి.

Firangipani Flower
Firangipani Flower

7. ఫిరంగిపాని

ఇది ఒక ఆర్నమెంటల్ మొక్క. దీని పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని చంప మొక్కలు అని కూడా పిలుస్తారు. చక్కటి వాసనతో రాత్రులు ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి తెలుపు, పింక్, పసుపు, ఎరుపు వంటి రంగుల్లో లభిస్తాయి. ఇవి చిన్న చిన్న కుండీల్లోనూ పెంచగలిగేలా ఉంటాయి.

దీనికి కాస్త వేడిగా ఉండే వాతావరణం కావాల్సి ఉంటుంది. మొదట్లో దీనికి ఎరువులు అందించాలి. ఎక్కువగా గాలి వచ్చే చోట పెట్టకూడదు. ఎక్కువ నీళ్లు అందించకూడదు. ఆకులు రాలే సమయంలో ఎక్కువ నీళ్లు అందించకూడదు. ఫంగల్ సమస్యలు వస్తే పెస్టిసైడ్స్ కొట్టాలి. నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనికి కంపోస్ట్ కూడా అందించాల్సి ఉంటుంది. ఈ వేళ్లు లోపలికి వెళ్లడం కాస్త కష్టం. అందుకే నేల మెత్తగా ఉండేలా చూసుకోవాలి.

8. కరివేపాకు

ఇది భారతీయ మూలాలున్న మొక్కే. పది నుంచి ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కరివేపాకు లేకుండా భారతీయ వంటకాలను ఊహించుకోలేం. దీన్ని టెర్రస్ పైన కూడా సులువుగా పెంచుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు కుండీలో దీన్ని నాటితే సరిపోతుంది. దీనికి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆకులు ఎక్కువగా రావడానికి లిక్విడ్ ఫర్టిలైజర్ చేరిస్తే బాగుంటుంది. కంపోస్ట్ వేసిన మట్టిని దీన్ని నాటేందుకు ఉపయోగించాలి. నేల కాస్త ఆమ్ల తత్వంతో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం మజ్జిగను పోయవచ్చు. వేసవిలో కాస్త ఎక్కువ నీళ్లు పోస్తుండాలి. మిగిలిన సీజన్లలో అప్పుడప్పుడూ పోస్తే సరిపోతుంది.

ఇవే కాదు.. దానిమ్మ, సపోటా, అరటి, సీతాఫల్, ఉసిరి, మల్లె, కాగితం పూలు, వేప, అశోక వంటి చెట్లను కూడా ఇంటిపై టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడానికి వీలుంటుంది.

https://krishijagran.com/agripedia/easy-steps-to-set-up-terrace-garden/

https://krishijagran.com/agripedia/terrace-gardening-know-the-advantages-cost-of-rooftop-farming/

Share your comments

Subscribe Magazine