Horticulture

వేసవిలో పెంచుకోదగ్గ పెరటిపంట రకాలు

KJ Staff
KJ Staff

పూర్వం ప్రతి ఇంటికి వెనుక భాగంలో విశాలమైన పెరడు ఉండేది, ప్రజలు ఈ పెరట్లో పాడి పశువుల్ని, తమ కుటుంబానికి కావాల్సిన కూరగాయల్ని పండించేవారు. రోజులు మారుతున్న కొద్దీ, అపార్టుమెంట్లు, కమ్యూనిటీ హౌస్ లు పెరిగి చాల తక్కువ కాళీ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఇరుకు ఇళ్లలో ఉండే ప్రజలకు ఇలా పెరటి పంటలు పెంచాలంటే దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. కానీ ఎంతో మంది ఔత్సాహికులు తమకు ఉన్న స్థలంలోనే ఎన్నో రకాల కూరగాయలు, పళ్ళు పండిస్తూ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

మీకున్న చిన్న స్థలంలోనే సులువుగా కూరగాయలు, ఆకుకూరలు పండించి మీ కుటంబ అవసరాల కోసం ఎటువంటి హానికారక మందులు వాడకుండా మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో, ఎండా వేడికి మొక్కలు పెరగవనే ఆలోచనలో చాల మంది ఉంటారు. అటువంటి వారు ఈ రకం కూరగాయలను సులభంగా పెంచుకోవచ్చు.

బెండకాయ:

వేసవి కాలంలో కూరగాయల సాగు చేపట్టే రైతులకు, మరియు ఇళ్ల వద్ద కూరగాయలు పెంచేవారికి బెండకాయ పెంపంకం ఎంతో అనువుగా ఉంటుంది బెండ మొక్క అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని నిలబడగలడు, అలాగే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా బెండను సులభంగా పెంచవచ్చు. ఇళ్లవద్ద బెండ మొక్కలు పెంచేవారు ఉదయాన్నే ఒక సరి నీరు పొయ్యాలి. మొక్క నాటిన 50 రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభం అవవుతుంది. పురుగులను నియంత్రించడానికి వేప నూనె కలిపినా నీటిని చిలకరిస్తే ప్రభావంతంగా పనిచేస్తుంది.

టమాటో:

టొమాటను దాదాపు అన్ని రకాల వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. టమాటా మొక్కకు సరిపడినంత కాంతి లభించినట్లైతే, మంచి రుచికరమైన టొమాటోలు కాస్తాయి. కాకపోతే వేసవి కాలంలో టొమాటోలు సాగు చేసేవారు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగే రకాలను ఎంచుకోవాలి. టమాటాలు పెంచడానికి మొక్కకి అవసరమైనంత నీటిని అందించాలి. మొక్క నాటిన 65-70 రోజుల తర్వాత కాయలు రావడం మొదలవుతుంది.

బీన్స్:

బీన్స్ శరీరానికి ఎంతో మేలైనవి. ఈ బీన్స్ మొక్కలు తీగజాతికి చెందినవి కనుక తీగలు పాకించడానికి కావాల్సిన తాళ్లు పందిర్లు ఏర్పాటుచేసుకోవాలి. వీటిలో విటమిన్- సి,ఏ, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఈ వేసవి కాలంలో ఎంతో మేలు చేస్తాయి. మరొక్క ప్రత్యేకత ఏమిటంటే మొక్కలు 30-35 లోపాలు బీన్స్ కాయడం మొదలవుతాయి. నాటిన తరువాత చాల కాలం వరకు దిగుబడి పొందవచ్చు.

వంకాయ:

పెరటి మొక్కలో వంకాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెరట్లో మొక్క సాగుచేసి వారి అందరి వద్ద వంకాయ మొక్కలను చూడవచ్చు. వంకాయలు తినడం ద్వారా ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా షుగర్ మరియు గుండె జబ్బులు దూరంగా ఉంచవచ్చు. అంతేకాకుండా వంకాయ మొక్కలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని బలంగా నిలబడగలవు.

ఈ విధంగా సరైన రకాలను ఎంచుకొని ఇంటి వద్దే ఎన్నో రకాల కూరగాయలను సాగుచేయవచ్చు. పురుగుమందులు మరియు ఇతర హానికారక మందులు వినియోగించడకుండా మీ కుటుంబం కోసం స్వచ్ఛమైన ఆహార పదార్ధాలు పండించే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది.

Share your comments

Subscribe Magazine