Kheti Badi

అధిక దిగుబడి పొందేందుకు భూసార పరీక్షలు చెయ్యించడం తప్పనిసరి

KJ Staff
KJ Staff

మత్తిలేనిదే వ్యవసాయం లేదు, అలాగే మనిషి మనుగడ కూడా ఉండదు. వివిధ ప్రాంతల్లోని వాతవరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ మట్టి లోని తత్త్వం మారుతూ ఉంటుంది. అలాగే మట్టి రకాన్ని బట్టి పోషకవిలువలు కూడా మారుతూ ఉంటాయి. మట్టి తత్వాన్ని బట్టి పంటలు సాగు చేస్తే మెరుగైన దిగుబడి పొందవచ్చని శాసత్రజ్ఞులు సూచిస్తున్నారు. రైతులు తమ పొలంలో ఏ పంటలు పండించాలో తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చెయ్యించడం తప్పనిసరి.

ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం ఎక్కువవ్వడంతో భూమిలోని సారం క్షిణిస్తుంది, ఇది ఇలాగె కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో, భూమిలో వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అధిక దిగుబడులు సాధించాలన్న ఉదేశ్యంతో విచక్షణ రహితంగా ఎరువులను వినియోగించడం ద్వారా మట్టి రసాయనాలతో నిండిపోతుంది, దీనివలన మట్టిలోని జీవవైవిధ్యం దెబ్బతింటుంది. అదే మట్టిలోని పోషకాలు బట్టి ఎరువుల మోతాదు ఎంత వాడాలో తెలుసుకుంటే అధిక ఎరువుల వినియోగాన్ని అరికట్టవచ్చు, అలాగే భూమిలో ఎటువంటి పంటలు పాందించాలన్న విషయంపై అవగాహన పెరిగి, రైతుల ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఖరీఫ్ సీసన్ మొదలుకావడంతో రైతులంతా వ్యవసాయ పనులు ప్రారంభించారు. మట్టి పరీక్షలు చెయ్యించడానికి ఇది ఒక మంచి అవకాశం. పంటలు సాగు చేసే రైతులందరూ, భూసార పరీక్షలు చెయ్యించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు, భూసార పరీక్షల ఆధారంగా పంటలు పండిస్తే రైతులపై వ్యయభారం తగ్గడమే కాకుండా ఆశించిన దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మట్టిని సేకరించే విధానం:

భూసార పరీక్షలు చేయించాలనుకున్న రైతులు, తామే సులభంగా మట్టి నమూనాను సేకరించి, మట్టి పరీక్ష కేంద్రాలకు పంపించవచ్చు. భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పొలంలో V లేదంటే Z అనే ఆకారం వచ్చే విధంగా అక్కడక్కడా ఎనిమిది అంగుళాల లోపలి వరకు మట్టిని తియ్యాలి. పొలం అంచులు, గట్లు, ఎక్కువ నీడ పడే ప్రదేశాలు మరియు నీరు నిలిచి ఉన్న ప్రదేశంలోని మట్టి నమూనా సేకరణకు పనికిరాదు. సేకరించిన మట్టిని శుభ్రమైన సంచి మీద ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తేమ ఆరిన మట్టిని పల్చని పొరలాగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి, మూలలకు ఎదురుగ ఉన్న భాగాన్ని తీసుకోని మిగతా రెండు భాగాలను పారెయ్యాలి. మట్టి అరకిలో వచ్చేవరకు ఈ పద్దతిని కొనసాగించాలి.

ఇలా సేకరించిన నమూనా మట్టిని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి, దాని మీద మీరు పేరు మరియు మీ పొలం వివరాలు నింపి, వ్యవసాయ అధికారికి అందించాలి. లేదంటే నేరుగా భూసార పరీక్ష కేంద్రానికి వెళ్లి మట్టిని పరీక్షించడానికి ఇవ్వచ్చు. మట్టి పరీక్ష పూర్తయి ఫలితాలు రావడానికి కనీసం 30-40 రోజుల సమయం పడుతుంది. భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించిన మట్టిలో, లవణాలు, పోషక విలువలు, కర్బన శాతం, ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు మరియు ఇతర విడవరాలను ఒక పట్టిక రూపంలో అందిస్తారు. దీనిలోనే అధిక దిగుబడికి వాడవలసిన పోషకాల వివరాలను కూడా పొందుపరుస్తారు.

భూసార పరీక్షల ద్వారా ఏ పంట వేస్తే లాభం వస్తుందో మరియు ఎంత మోతాదులో ఎరువులను వాడాలో తెలియచేస్తారు. పంట పొలాల్లో ఆమ్ల, క్షార స్థాయిని పరీక్షించి, ఈ స్థాయిని నియంత్రించడానికి పాటించవలసిన యాజమాన్య పద్డతుల గురించి కూడా పొందుపరుస్తారు. మట్టి నమూనాలను పంపిన 30 రోజుల్లోనే ఆన్లైన్ ద్వారా అందిస్తారు, దీనితోపాటు భూసార పరీక్షలకు సంభందించిన ఆరోగ్య కార్డును కూడా రైతులకు అందిస్తారు. భూసార పరీక్షల చెయ్యించడం ద్వారా తమ వ్యవసాయ పొలాల్లో అనువైన పంటలను సాగుచేసేందుకు అవకాశం ఉంటుంది, దీనివలన రైతుల దిగుబడి పెరిగి మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఒకే పంట సాగు చేస్తున్న రైతులు, భూసార పరీక్షలు చెయ్యించి, సాగుకు అనుగుణంగా ఉన్న పంటను సాగు చేస్తే మేలైన ఫలితాలు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine