News

సహజ వ్యవసాయం కింద 4 లక్షల హెక్టార్లు!

S Vinay
S Vinay

వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ పరంపరగత్ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 4 లక్షల హెక్టార్లను సహజ వ్యవసాయం కిందకు తీసుకువచ్చామని చెప్పారు.

Natural Farming:నరేంద్ర సింగ్ తోమర్ వినూత్న వ్యవసాయంపై ప్రసంగిస్తూ, ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, మంచి-నాణ్యమైన ఉత్పత్తులను మరియు రైతులకు లాభాలను అందించే వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు క్రమంగా సహజ వ్యవసాయానికి అలవాటు పడుతున్నాయి. ఫలితాలను చూసి మరింత మంది రైతులు చేరతారని చెప్పారు.

వినూత్న వ్యవసాయ సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ వర్సిటీల వీసీలతో చర్చించిన తర్వాత సహజ వ్యవసాయంపై నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుందని, దానికి అనుగుణంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందుకు సాగుతుందని తోమర్ చెప్పారు.

సహజ వ్యవసాయానికి మారడం ద్వారా ఉత్పత్తి తగ్గిపోతుందనే భయం కొందరికి ఉండవచ్చు.సహజ వ్యవసాయం యొక్క విజయగాథలను చూసిన తర్వాత రైతులు ముందుకు వస్తారని నరేంద్ర సింగ్ తోమర్ విశ్వాసం వ్యక్తం చేసారు.వ్యవసాయంలో రసాయనాలు ఉపయోగించని ప్రాంతాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం దాదాపు 38 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం చేపట్టామని మంత్రి తెలిపారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన ఉప పథకంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది. నికోబార్ మరియు లడఖ్ ప్రాంతాలలో రసాయనాలు ఉపయోగించని వ్యవసాయ క్షేత్రాలను ధృవీకరించే కార్యక్రమం జరుగుతోంది. అటువంటి వ్యవసాయ క్షేత్రాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమం లో పాడి పరిశ్రమ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి సమయంలో నాణ్యమైన ఉత్పత్తులకు కొత్త డిమాండ్ ఏర్పడిందని, రైతులు దీనిని గమనించి వ్యవసాయం లో వైవిధ్యతని చూపాలి అని వ్యాఖ్యానించారు.

మరిన్ని చదవండి.

వ్యవసాయ రంగంలో వనిత ప్రాముఖ్యత

Share your comments

Subscribe Magazine