News

అలెర్ట్! పొంచిఉన్న తుఫాన్.. తెలంగాణ, ఏపీ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు.!

Gokavarapu siva
Gokavarapu siva

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్. సముద్ర తీరంలో తుఫాను బెల్స్ మోగుతున్నాయి. తీరం వెంబడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శక్తివంతమైన తుపాన్‌గా మారే ప్రమాదం ఉందని తెలిపింది.

ఈ పరిణామం ఫలితంగా నెల్లూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలుత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కుంభవృష్టిగా మారి శనివారం నాటికి తుఫానుగా రూపాంతరం చెంది, వాయువ్య దిశగా కదులుతాయని అంచనా వేసింది.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. రైతులకు మరో 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌.. ముఖ్యమంత్రి జగన్..!

రానున్న ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. రైతులకు మరో 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌.. ముఖ్యమంత్రి జగన్..!

Share your comments

Subscribe Magazine