News

రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మరో ముందడుగు..!

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు సంబంధించిన అన్ని సేవలను అర్హులైన ప్రతి రైతుకు అందేలా కార్యాచరణ సిద్ధం చేశారు. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సాగుతో పాటు.సంక్షేమ ఫలాలు అందుకోవడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా "రైతు స్పందన" (ఫార్మర్స్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం స్వందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి వచ్చే అర్జీదారుల్లో అత్యధికులు రైతులే ఉంటున్నారు. ఆర్బీకే సిబ్బంది స్పందన కార్యక్రమానికి విధిగా హాజరవ్వాల్సి ఉండటంతో ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఆర్టీకేలకు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కార మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆర్బీకేల్లో రైతుల కోసం ప్రతిరోజు స్పందన నిర్వ హించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే స్పందనలో ఆర్బీకేల్లో పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సం వర్ధక, మత్స్య శాఖ సహాయకులు హాజరు కానున్నారు. ఈ సమయంలో సచివాలయాల్లో నిర్వహించే స్పందనకి వాటిలో పనిచేసే సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఉదయం సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ వేసి తర్వాత ఆర్బీకేలకు వచ్చి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి గ్రామ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాలు సందర్శిస్తుంటారు.మధ్యాహ్నం సచివాల యాల్లో నిర్వహించే స్పందనకు హాజరవుతున్నారు తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం వీరంతా పనివేళల్లో ఎప్పుడైనా సరే ఆర్బీకేల్లోని కియోస్క్, బయోమెట్రిక్ డివైస్లలో హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిం చారు.

Share your comments

Subscribe Magazine