News

పంటను ఆరబెట్టేందుకు హెలికాప్టర్ వాడుతున్న రైతులు!

S Vinay
S Vinay

సాధారణంగా పంటలు పండటానికి నీరు ప్రధాన వనరు నీరు, దీనికి ప్రధాన వనరు వర్షం. రైతు సోదరులు పంటల సాగు చేయడానికి వానలు ఎప్పుడు కురుస్తాయా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ వర్షం కురవడమే ఈ రైతుకి శాపం అయింది. పూర్తి వివరాలు చదవండి.

సాధారణంగా పాశ్చాత్య దేశాలలో పంటలకు ఎరువులు చల్లడానికి హెలికాఫ్టర్లు వాడుతుంటారని మనం విని ఉంటాం, దీనికి గల కారణం వారు వందల ఎకరాలలో సాగు చేపట్టడమే కాబట్టి ఎరువులు హెలికాఫ్టర్ల ద్వారా చల్లడం చాల సులభం మరియు చాలా తక్కువ సమయంలో పనులు అయిపోతాయి.

నేలపై పండే పంటలకి వేర్వేరు వ్యవసాయ సాగు పద్ధతులు ఉన్నాయి, కొన్ని పంటలు ఎక్కువ ఉష్ణోగ్రతలో పండితే మరికొన్ని చల్లని ప్రదేశాలలో పండుతాయి. కొన్నింటికి పొడి వాతావరణం కావల్సి వస్తే మరి కొన్నిటికి తడి వాతావరణం కావాలి. వరి వంటి పంటల సాగుకి ఎక్కివ మొత్తంలో నీరు కావాలి, అయితే చెర్రీ పండు సాగుకి తక్కువ నీరు అవసరం.అంతే కాకుండా చెర్రీ పండ్లు పొడి వాతావరణంలోనే బాగా పండతాయి. ఈ చెర్రీ పండ్ల సాగుకి అధిక వర్షాలు అవసరం లేదు, ఎందుకంటే వర్షం పడితే ఈ పంట మొత్తం నాశన అయిపోతుంది. వర్షపు నీరు పండు పై బాగాన నిలిచిపోవడం వలన పండ్లు ఆ నీటిని పీల్చుకొని లోపల ఉన్న గుజ్జు పూర్తిగా దెబ్బతింటుంది. గుజ్జు దెబ్బతిన్న పండ్లకి మార్కెట్లో విలువ పడిపోతుంది వీటికి కాబట్టి పండ్ల దిగుబడి వచ్చిన కానీ ప్రయోజనం ఉండదు. దీనికి పరిష్కార మార్గంగా చెర్రీ పంటను కాపాడుకునేందుకు బ్రిటన్ వంటి ప్రాంతాల్లో చాలా మంది రైతులు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.హెలికాప్టర్ రెక్కల నుంచి ఉత్పన్నమయ్యే గాలి వలన చెట్లపై నిలిచిపోయిన నీరుంతా ఆరిపోతుంది. తద్వారా వారు పంటను కాపాడుకుంటున్నారు.

చెర్రీ పండు వలన కలిగే ప్రయోజనాలు:
విటమిన్ 'C' కి మంచి మూలం

మెదడు మరియు కండరాల పనితీరును మెరుగుపరుస్తుం ది.

వీటిని సేవించడం వలన మీరు బాగా నిద్ర పోవడానికి సహాయపడవచ్చు .

చర్మం యొక్క వృద్ధాప్యం ని నెమ్మ దిస్తుంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మధుమేహం నుండి కాపాడుతుంది.

మరిన్ని చదవండి.

స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఫిక్షనల్, డాగ్ మ్యానే ఒరిజినల్!

ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో నకిలీ రివ్యూలను తనిఖీ చేయనున్న కేంద్రం!

Share your comments

Subscribe Magazine

More on News

More