News

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. నేడు రైతు ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !

Srikanth B
Srikanth B
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త..  నేడు రైతు ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. నేడు రైతు ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త ప్రకటించింది . ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణముగా బ్యాంకు నుంచి పంట రుణాలను తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు ఆ సంవత్సరానికి సంబందించిన వడ్డీని రాయితీగా ఇస్తామన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈమేరకు వడ్డీ రాయితీ మొత్తాన్ని రైతుల యొక్క ఖాతా లలో నేడు జమచేయనున్నట్లు ప్రకటించింది .

అప్పులతో రైతు ఇబ్బంది పడకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ని వారి వారి బ్యాంకు ఖాతాలలో జమచేస్తుంది . 2014-19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్‌ 2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019-20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్‌ 2020 సీజన్‌లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది.

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

పంటకాలం రబీ 2020-21, ఖరీఫ్‌ 2021 సీజన్‌లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 2.54 లక్షల మంది ఖాతాల్లో రూ.45.22 కోట్ల నిధులను అధికారులు జమచేయనున్నారు. రబీ 2020-21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచనున్నారు. మరోవైపు ఖరీఫ్‌ 2021 జాబితా ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.

రబీ పంటకు ఎరువుల కొరత లేదు.. !

Related Topics

subsidy croploan pmkisan

Share your comments

Subscribe Magazine