News

నెల్లూరు లో రూ 250 కోట్ల వ్యయంతో నానో యూరియా ప్లాంట్ కి ఇఫ్కో ఏర్పాట్లు. నానో యూరియా లాభాలు తెలుసుకోండి.

S Vinay
S Vinay

నెల్లూరు లో నానో యూరియా ప్లాంట్ ని నెలకొల్పడానికి (IFFCO) భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం నానో యూరియా ప్లాంట్ ని నెల్లూరులో నెలకొలపడం ఇప్పటికే ఖరారు అయింది ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణానికై భూముల కేటాయింపు పై చర్చలు జరుగుతున్నాయి.

అసలు ఏంటి ఈ నానో యూరియా:
నానో యూరియా అనేది ద్రవరూపం లో ఉంటుంది. ఇది (IFFCO) భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ చేత తయారు చేయబడింది. భారత ప్రభుత్వ కూడా ఆమోదం తెలిపింది.ఇందులో నత్రజని 40 శాతం ఉంటుంది.రైతులు సాధారణంగా వాడే ఒక బ్యాగ్ యూరియాకి బదులుగా ఒక బాటిల్ నానో యూరియాను వినియోగించవచ్చు. దీనిని వాడటం లో ఎటువంటి వృథా ఉండదు.ఇప్పటికే దక్షిణాదిన మొదటి ప్లాంట్ ని బెంగుళూరు లో నిర్మిస్తుండగా రెండవది నెల్లూరులో స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. నెల్లూరు లో వున్నా అగ్రిసెజ్ లో ఈ ప్లాంట్ ని నిర్మించడానికి ఇఫ్కో ఆసక్తి చూపుతుంది. ఇది కోటి లీటర్ల ద్రవ యూరియా ఉత్పత్తి సామర్థ్యం తో ఉంటుంది. దీని నిర్మాణానికై రూ. 250 కోట్ల వ్యయం కేటాయించారు,కనీసం 20 ఎకరాలలో నిర్మించడానికి చర్చలు జరుగుతున్నాయి.

నానో యూరియా వళ్ళ లాభాలు తెలుసుకోండి:

పంటలు పండించడానికి ఎక్కువగా అవసరమయ్యే పోషకం నత్రజని, రైతులు దీనిని ఎక్కువగా యూరియా ద్వారా మొక్కలకి అందితున్నారు అయితే ఇప్పుడు ఈ యూరియా బస్తాలకి ప్రత్యామ్నాయమే నానో యూరియా ఇది ద్రవ రూపంలో ఉంటుంది.

యూరియా బస్తాతో పోల్చుకంటే దీని ఖర్చు తక్కువ.

రవాణా చేసుకోవడం కూడా చాలా సులభం.

దీనిని వినియోగించడం లో అనవసరమైన వృథా ఉండదు, మొక్కలకి దీనిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. సుమారుగా 80 నుండి 90 శాతం యూరియా మొక్కలకి అందుతుంది.

అన్ని రకాల వ్యవసాయ పంటలకి ఈ నానో యూరియా ని వినియోగించవచ్చు.

నానో యూరియాని వినియోగించడం వల్ల భూసారంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు.

 

మరిన్ని చదవండి.

BIG UPDATE: ఇండియన్ నేవి లో 2500 ఖాళీల పోస్టులకి నియామకం ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఇంటర్ పాసైతే చాలు.

మామిడి పండ్లను విదేశాలకి ఎగుమతి చేసి మంచి లాభాలను పొందడానికి ఈ సూచనలను పాటించండి.

 

Share your comments

Subscribe Magazine

More on News

More