News

కిసాన్ క్రెడిట్ కార్డ్: KCC పథకం కింద 2.94 కోట్ల మంది రైతులకి ఇప్పటి వరకు మంజూరైన రుణాలు?

S Vinay
S Vinay

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా రైతులందరిని కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద ప్రయోజనాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారాలు చేస్తుందని పేర్కొన్నారు


బుధవారం (23 మార్చి 2022) న వ్యవసాయం మరియు రైతుల సంక్షేమంపై పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని మెరుగుపరచడంతోపాటు మెరుగైన సేవలు రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వివిధ అంశాలపై
కమిటీ చర్చించింది.

కమిటీని ఉద్దేశించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇంకా లబ్ది పొందని రైతులని కవర్ చేయడానికి ప్రభుత్వం కెసిసి సంతృప్త ప్రచారం చేస్తోందని అన్నారు . అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు రూ. ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ రుసుము, వంటివి తొలగించబడ్డాయి, తద్వారా ఎక్కువ మంది రైతులు తక్కువ వడ్డీకి రుణాలు పొందగలరని వ్యాఖ్యానించారు.


రైతుల ఇబ్బంది దృష్ట్యా KCC ఫారమ్ మరింత సులభంగా మార్చబడిందని మరియు పూర్తి దరఖాస్తు ఫారమ్ అందిన 14 రోజులలోపు కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు పంపామని ఆయన చెప్పారు .ఇప్పటి వరకు KCC పథకం కింద సుమారుగా 2.94 కోట్ల మంది రైతులకు మంజూరైన రుణాలు 3.22 లక్షల కోట్లు అని నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సూచనను పరిశీలించి రైతుల సమస్యలకి పరిష్కారాలను ఇస్తుంది అని వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని చదవండి.

పిఎం కిసాన్ యోజన: రూ. 4350 కోట్ల కంటే ఎక్కువ నిధులు అనర్హులు లబ్ది పొందారు,తిరిగి జప్తు చేయాలనీ రాష్ట్రాలను కేంద్రం కోరింది

Share your comments

Subscribe Magazine