News

పెరగనున్న LPG సిలిండర్ ధరలు...కొత్తగా వస్తున్న సబ్సిడీ ఎంత?

S Vinay
S Vinay

సిలిండర్ల ధరలు ప్రతి నెలమొదటి తేదీన నిర్ణయించబడతాయి.మే19న కంపెనీలుఎల్పీజీ సిలిండర్ ధరనురూ.3.50 పెంచాయి. ఇప్పుడుమళ్లీజూన్ 1 నాటి గ్యాస్ సిలిండర్ల ధరలను ఖరారు చేయనున్నారు.

LPG cylinder: LPG సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.మే నెలలో, సిలిండర్ ధరలు వినియోగదారులకు రెండుసార్లు షాక్ ఇచ్చింది. మే 7వ తేదీన చమురు కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరను అకస్మాత్తుగా రూ.50 పెంచాయి. ఆ తర్వాత మే 19న మళ్లీ సిలిండర్‌పై రూ.3.50 పెంచారు.

ఇలాంటి పరిస్థితిలో మీరు పెరిగిన ధరల నుండి ఉపశమనం పొందాలనుకుంటే, మీ LPG సిలిండర్ ను ఈరోజే బుక్ చేసుకోండి, మీరు ఈరోజే బుక్ చేసుకుంటే కొత్త రేట్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం వస్తున్న LPG సిలిండర్ సబ్సిడీ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం LPG సబ్సిడీని ప్రకటించారు , ఇది సామాన్యులకి పెరుగుతున్న ధరల నుండి కాస్త ఉపశమనం ఇవ్వనుంది."ఈ సంవత్సరం,ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని మంజూరు చేస్తాము ," అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

LPG సిలిండర్ సబ్సిడీకి ఎవరు అర్హులు?

ఎస్సీ, ఎస్టీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), అత్యంత వెనుకబడిన తరగతులు, అంత్యోదయ అన్న యోజన (AAY), తేయాకు మరియు మాజీ టీ తోట తెగలు, అటవీ నివాసులు.

దరఖాస్తుదారుల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి.

LPG సిలిండర్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇతర LPG కనెక్షన్‌లను కలిగి ఉండకూడదు.

మరిన్ని చదవండి.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 10 లక్షల సహాయం!

పోస్టాఫీస్‌ పథకం: నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టి...రూ. 35 లక్షలు పొందండి!

Related Topics

lpg cylinder lpg subsidy

Share your comments

Subscribe Magazine