News

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి ,మామిడి పంటలు!

S Vinay
S Vinay

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరి, మామిడి పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిని రైతన్నలకు నష్టాలను మిగిల్చాయి.

పంటలు పండటానికి వర్షాలు ప్రధాన వనరు, కానీ ఇప్పుడు అదే వర్షం రైతన్నలని నిలువునా ముంచింది.తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షంలో తడిసిన కారణంగా ధాన్యం నాణ్యతని కోల్పోయింది. ధాన్యం అధిక తేమతో రంగు మారిపోయింది.

వరిపంట వర్షంలో తడిసిపోవడం ఇది రెండవసారని సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి వరి కుప్పలు కొట్టుకుపోవడాన్ని ఆపేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. మార్కెట్‌ యార్డుల్లోని వరి నిల్వలు వర్షపు నీటిలో తడిసిపోయాయి. తడిసిన వరిపంటకు కనీస మద్దతు దార రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కప్పి ఉంచడానికి రైతుల దగ్గర టార్పలిన్ లు అందుబాటులో లేవు.

కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు.భారీ ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.లోతట్టు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలను అరికట్టేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.

కొల్లాపూర్ మామిడి:
కొల్లాపూర్‌లో కురుస్తున్న వర్షాలకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి.ఈదురు గాలులు మరియు వర్షాల కారణంగా చెట్టుపై నుంచి మామిడి కాయలు పడి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్ కి తరలించాల్సిన సమయంలో ఉన్నపాటుగా ఇలా నష్టం వాటిల్లడం తో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

గత ఏడాదితో పరిగణిస్తే కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి దిగుబడి ఈ ఏడాది తగ్గిపోయింది.మామిడి దిగుబడి తగ్గడం తో ధర ఎక్కువగా పలికింది.కొల్లాపూర్ ప్రాంత మామిడి రైతులు ,మామిడి మార్కెట్ యార్డు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మార్కెట్ యార్డు నిర్మించడం వల్ల కొల్లాపూర్ మామిడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పలువురు రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చదవండి.

టమాటా లో గల ముఖ్యమైన మరియు అధిక దిగుబడినిచ్చే రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine