Animal Husbandry

ఆవు పాలు, గేదె పాలలో పోషకాలు

KJ Staff
KJ Staff
Milk
Milk

పాలు చాలా ఆరోగ్యకరమైనవి. అందుకే రోజును దానితోనే మొదలు పెడతాం మనలో చాలామంది. టీ, కాఫీల రూపంలో అయినా పాలతోనే రోజును మొదలు పెట్టి రాత్రి పెరుగు లేదా పాలతో ముగిస్తాం.

పాలు ఎంతో ఆరోగ్యకరం. అవి ఎంతో పోషకాలు నిండినవి. అయితే ఏ పాలు మంచివి అన్న ప్రశ్న చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు మంచివా? అంటే ఈ రెండింటికీ వాటి కంటూ ప్రత్యేకంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రెండింటిలోనూ కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఏ పాలు తాగితే మనకు మంచిది అన్న విషయం మీకే సులువుగా అర్థమైపోతుంది.

పాలుగా చూస్తే ఆవు పాలు చాలా తేలిగ్గా ఉంటాయి. సులువుగా జీర్ణమవుతాయి. కానీ గేదె పాలు కాస్త చిక్కగా ఉండి అరగడానికి సమయం తీసుకుంటుంది. మిగిలిన పోషకాల్లో తేడాల గురించి తెలుసుకుందాం..

ఆవు పాలు, గేదె పాలల్లో ప్రధాన తేడాలు

ఫ్యాట్ కంటెంట్

ఆవు పాలు, గేదె పాలలో కొవ్వు శాతంలో చాలా తేడాలుంటాయి. ఇవే ఈ పాలు చూడగానే పల్చగా లేదా చిక్కగా కనిపించేలా చేస్తాయి. ఆవు పాలలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి చూసేందుకు చాలా పల్చగా కనిపిస్తాయి. అందుకే ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయని కూడా చెబుతారు. కానీ గేదె పాలలో మాత్రం కొవ్వు శాతం చాలా ఎక్కువ. అందుకే వీటిని తాగితే చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉంటుంది. అందుకే దీని నుంచి వెన్న కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. చాలామంది తేలిగ్గా జీర్ణమవుతాయి కాబట్టి ఆవు పాలను తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రొటీన్ శాతం

ఆవు పాలతో పోల్చితే గేదె పాలలోనే ఎక్కువ శాతం ప్రొటీన్లు ఉంటాయి. ఈ రెండింటిలో ప్రొటీన్ శాతం ఉన్న తేడా 10 నుంచి 11 శాతం. గేదె పాలు ఆవు పాలతో పోల్చుకుంటే హీట్ రెసిస్టెంట్ కూడా. ఇలా ఎక్కువ ఫ్యాట్, ప్రొటీన్ ఉండడం వల్లే చిన్న పిల్లలు, ముసలి వారు గేదె పాలను తీసుకోవడం వల్ల జీర్ణం కాక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చాలామంది ఆవు పాలను తీసుకుంటూ ఉంటారు. ప్రొటీన్ అవసరం ఎక్కువగా ఉన్నవారు గేదె పాలను తీసుకోవచ్చు. మిగిలిన వారికి ఆవు పాలే మంచివి.

నీటి శాతం

ఆవు పాలలో 87 శాతం కంటే ఎక్కువగా నీళ్లు ఉంటాయి. అందుకే వీటిని పల్చని నీళ్లలాంటి పాలు అని పిలుస్తారు. ఇందులో పాల సాలిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గేదె పాలలో నీటి శాతం తక్కువ.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ గురించి చూసుకుంటే కూడా ఆవు పాల కంటే గేదె పాలే మంచివి. గేదె పాలలో 0.65 mg/g కొలెస్ట్రాల్ ఉంటే.. ఆవు పాలలో 3.14 mg/g కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే గేదె పాలు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారితో పాటు బీపీ, కిడ్నీ సమస్యలు, అధిక బరువు, పీసీఓడీ, గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా మంచివి.

ఆవు పాలు, గేదె పాల మధ్య మరిన్ని తేడాలు

* రాత్రి ఆనందంగా నిద్రపోయేందుకు గోరు వెచ్చని పాలు తాగుతుంటారు చాలామంది. అయితే సుఖమైన నిద్రను అందించే గుణం ఆవు పాలతో పోల్చితే గేదె పాలలో ఎక్కువగా ఉంటుందట. అందుకే హాయిగా నిద్రపోవాలంటే రాత్రి పడుకునే ముందు గ్లాసు గేదె పాలు తాగండి.

* గేదె పాలలో క్యాల్షియం కూడా ఆవు పాల కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆవు పాలలో పొటాషియం, సోడియం స్థాయులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లలకు ఇది చాలా మంచిదని చెబుతారు.

* ఆవు పాలు చాలా క్రీమీగా, చిక్కగా ఉంటాయి. అందుకే పెరుగు, పనీర్, ఖీర్ వంటివి చేయడానికి వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలను సందేశ్, రసగుల్లా లాంటివి చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

* ఆవు పాల నుంచి తీసిన వెన్నతో చేసిన నెయ్యి ని తీసుకోవడం వల్ల పిత్త గుణం తగ్గి, జీర్ణ శక్తి పెరుగుతుంది. మరో వైపు గేదె పాల నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కఫ గుణం పెరుగుతుంది.

ఆవు పాలు, గేదె పాలు రెండిట్లో సమానంగా ఉన్న గుణాలేంటంటే..

కొన్ని గుణాల్లో తేడాలున్నా.. ఆవు పాలు, గేదె పాలు రెండింట్లోనూ కామన్ గా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

* ఆవు పాలు, గేదె పాలు రెండూ తియ్యగానే ఉంటాయి. ఈ రెండూ చక్కటి రుచితో ఉండడం మాత్రమే కాదు.. శరీరానికి చలువ చేస్తాయి.

* ఈ రెండు రకాల పాలు సహజ సిద్ధమైన ఆప్రొడిసియాక్స్ గా పనిచేస్తాయి. శరీరంలో శృంగార కాంక్షను పెంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం రోజూ పాలను తాగడం వల్ల మీ సెక్సువల్ లైఫ్ చాలా ఆనందంగా, యాక్టివ్ గా ఉంటుందట.

* ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు రకాల పాలు కూడా పిత్త గుణాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరంలో మంట, దురద వంటివి ఉంటే తగ్గిపోతాయి.

* ఆవు పాలు, గేదె పాలు రెండూ ఎన్నో పోషకాలు నిండినవి. అందుకే ఈ రెండు మన శరీరానికి శక్తిని అందించేందుకు తోడ్పడతాయి.

మొత్తంగా చూసుకుంటే ఆవు పాలు, గేదె పాలు రెండూ రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కూడా. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. అయితే వ్యక్తులు ఎలాంటి పాలను తీసుకుంటే వారికి తట్టుకునే శక్తి ఉంటుందన్న దానిపై ఆధారపడి తాగే పాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ శరీరానికి నప్పే పాలను ఎంచుకోండి.

https://telugu.krishijagran.com/agripedia/know-about-different-crop-seasons-kharif-rabi-and-zaid/

https://telugu.krishijagran.com/health-lifestyle/why-drinking-tulsi-milk-is-good-for-your-overall-health/

https://telugu.krishijagran.com/animal-husbandry/during-rainy-season-do-not-do-such-mistakes-it-may-effect-health-of-milk-giving-animals/

Related Topics

Dairy Farm adulterated milk

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More