తెలంగాణాకు చెందిన హైద్రాబాద్లో ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వ్యక్తులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ పాస్ అయినవారు కూడా అర్హులే. దీనికి సంబంధించి టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తు కోరుతుంది.
ఈ విభాగంలో భర్తీ కొరకు మొత్తానికి పోస్టుల సంఖ్య వచ్చేసి 1553 ఉన్నాయి. ఈ 1553 పోస్టుల్లో జనరల్ రిక్రూట్మెంట్ కింద 1000ఎంపోస్టులు మరియు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 553 పోస్టులు భర్తీకి ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత వచ్చేసి పదో తరగతితో పాటు ఐటిఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్ మ్యాన్) ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ కు సంబంధించి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆ వ్యక్తులకు వయస్సు వచ్చేసి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు వ్యక్తులను ఎంపిక చేయడానికి రాత పరీక్ష ఉంటుంది. అధికారులు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఎంపిక కొరకు పరిగణలోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షలు రాయడానికి జీహెచ్ఎంసీ /హెచ్ఎండీసీ పరిధిలోని కొన్ని కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి..
ఏపీ ఇంటర్ పరీక్షా హాల్ టికెట్లు విడుదల..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం వచ్చేసి నెలకు రూ.24,340 నుంచి రూ.39,405 వరకు ప్రభత్వం చెల్లిస్తాది. ఈ పరీక్షకు మీరు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల (మర్చి) 8వ తేదీ నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 28.03.2023. దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష అనేది ఏప్రిల్ నెల 30వ తేదీన (30.04.2023) ఉంటుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి https://www.tssouthernpower.com/ ఈ వెబ్సైట్ ను సంప్రదించండి.
ఇది కూడా చదవండి..
Share your comments