అగ్నిపథ్ పథకం ప్రకారం, ఏటా దాదాపు 45,000 నుండి 50,000 మంది సైనికుల (' అగ్నివీర్స్' అని పిలుస్తారు ) నియామకం చేపడుతారు.అయితే ఇది నాలుగు సంవత్సరాల ఒప్పొండా ప్రాతిపదికన ఉంటుంది.
Agnipath Scheme:17.5 సంవత్సరాల మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పథకం కేవలం అధికారి స్థాయి కంటే తక్కువ స్థాయి సిబ్బందికి మాత్రమే వర్తిస్తుంది.ఈ పథకాన్ని ప్రారంభించిన రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ త్రివిధ దళాల్లో స్వల్పకాలిక నియమాకాలు చేపట్టి ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల సర్వీ స్ తర్వా త ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయనున్నారు. 25 శాతం కొలువుల్లో కొనసాగవచ్చని తెలిపారు.
అయితే నాలుగు సంవత్సరాల తర్వాత అభర్ధుల భవిష్యత్తు గందరగోళంగా ఉంటుందని ఈ పథకం వివాదంగా మారింది కాని సాయుధ బలగాల్లో 4 ఏళ్లు సర్వీస్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాలను చేకూర్చనుంది.ఒకవేళ వారు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కేంద్రం వారికి బ్యాంకు రుణం ద్వారా ఆర్హిక సహాయాన్ని అందజేస్తుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ జారీ చేస్తుంది. వారికీ బ్రిడ్జింగ్ కోర్సును కూడా ఆఫర్ చేస్తుంది. ఈ సర్వీస్‌ను పూర్తి చేసిన యువతకు (CAPF), ఇతర ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మొదటి సంవత్సరంలో రూ. 4.76 లక్షల ప్యాకేజీ నాలుగవ సంవత్సరంలో అప్‌గ్రేడేషన్‌తో రూ. 6.92 లక్షల జీతం ఉంటుంది అంతే కాకుండా రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా రక్షణ కూడా ఉంది.
మరిన్ని చదవండి.
Share your comments