విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఒక ముక్యమైన విషయాన్ని తెలియజేసింది. తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలలో కొన్ని చిన్న మార్పులు చేసినట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి గతంలో ప్రకటించిన తేదీలు వర్తించవు. ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వం విద్యార్థులను కోరింది.
మొత్తం 14,565 బీటెక్ సీట్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వెబ్ ఆప్షన్లు సమర్పించిన విద్యార్థులు సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఫలితంగా, ఈ మార్పులు చేయడానికి గడువు జూలై 12 వరకు పొడిగించబడింది. అదనంగా, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇతర సంబంధిత తేదీల కోసం గడువులు కూడా పొడిగించబడ్డాయి.
ఇది కూడా చదవండి..
రైతుబంధు: ఖాతాల్లో డబ్బులు జమకాక ఆందోళనలో రైతులు
దీంతో జులై 16లోగా సీట్ల కేటాయింపు ఖరారు కానుంది. ఫీజు చెల్లింపులు మరియు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు జూలై 16 నుండి జూలై 22 వరకు జరగనుంది. దీని తరువాత, మొదటి రౌండ్ కౌన్సెలింగ్ జూలై 22 న ముగుస్తుంది. తదనంతరం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ జూలై 24 నుండి ఆగస్టు 2 వరకు జరుగుతుంది. చివరి దశ కౌన్సెలింగ్‌ను ఆగస్టు 4 నుంచి ఆగస్టు 11 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి..
Share your comments