ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పర్వానికి తెర పడనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు 10 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నేటితో పదివ తరగతి విద్యార్థుల నిరీక్షణ ముగియనుంది.
ఈ రోజు పదకొండు గంటలకు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి 10 వ తరగతి పరీక్షల వివరాలను వెల్లడించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం విద్యాశాఖ కమిషనేర్ ఎస్. సురేష్ కుమార్ ఫలితాలను వెల్లడించారు. పరీక్షా ఫలితాలను తెలుసుకునేందుకు విద్యార్థులు results.bse.ap.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ వివరణలు ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన హాల్ టికెట్ మెమో ఈ వెబ్సైట్లో మీకు లభిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్లో ఎస్ఎస్సి పరిక్షలు మార్చ్ 18 నుండి మార్చ్ 30 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరిక్షా ఫలితాలు వెల్లడించడం విశేషం. ఈ పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన వారిలో బాలురు 84.32 శాతం మరియు బాలికలు 93.7 శాతం ఉన్నారు. మొత్తం పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 86.69% ఉతీర్ణులయ్యారు.
10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించబోతున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో విడుదల చెయ్యనున్నారు.
Share your comments