Education

AP Inter exam hall Tickets 2022: ఏపీ ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదల.. డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలి ?

Srikanth B
Srikanth B

AP Inter exam hall Tickets 2022: ఇంటర్ మెదటి, రెండో ఏడాదికి సంబంధించిన పరీక్షా హాల్ టిక్కెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థులు సంబంధించిన కాలేజీల వివరాలను jnanabhumi.ap.gov.in లో లాగిన్ ద్వారా అధికారిక వెబ్సైటు నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది .

AP Inter exam Hall Ticket 2022: మే 6వ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న వేళా   విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు jnanabhumi.ap.gov.in హాల్‌టికెట్లను వెబ్ సైట్ లో  విడుదల చేసింది. 

విద్యార్థులు  నేరుగా వైబ్ సైట్ నుండి డౌన్ లోడ్  చేసుకోకుండా   కళాశాలల ప్రిన్సిపాల్లందరూ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ (AP Inter hall Tickets 2022 Download) చేసి విద్యార్థులకు ఇవ్వాలని బోర్డు అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది.

అంతేకాకుండా హాల్ టికెట్ల జారీ ఏదైనా సమస్యలు తలెత్తితే తీవ్రంగా పరిగణించాలని సూచించింది. విద్యార్థులు పేర్లు, మీడియం, సబ్జెక్టుల వంటి ఇతర వివరాలను నిశితంగా పరిశీలించాలని.. అవకతవకలు జరిగితే సంబంధిత ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్లాలని  సూచించింది

ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 23వరకు ... సెకండియర్ పరీక్షలు మే 7 నుంచి 24 వరకు జరగనున్నాయి.  ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరక పరీక్షలు  జరుగుతాయని బోర్డు వెల్లడించింది .

తెలంగాణ: EAMCET ర్యాంకుల తో BSc నర్సింగ్ లో ప్రవేశాలు !

Share your comments

Subscribe Magazine

More on Education

More