మంగళగిరిలో ఉన్న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్ - పాలీసెట్ ( పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) 2023 యొక్క నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విధ్యార్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు, సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళశాలల్లో డిప్లొమా ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కళాశాలల్లో అడ్మిషన్స్ అనేవి ఏపీ పాలీసెట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ఉంటాయి.
ఈ పాలీసెట్ పరీక్షకు అనేక విభాగాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, వెబ్ డిజైనింగ్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోమెడికల్, ఆర్కిటెక్చర్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మైనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అనేవి వివిధ రకాల విభాగాలున్నాయి.
ఈ పాలీసెట్ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు అనగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టేట్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓపెన్ స్కూల్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీన్ ఎడ్యుకేషన్, ఏపీ ఓపెన్ స్కూల్ మరియు ఇతర రాష్ట్రాల బోర్డుల నుండి మాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉండి, పదో తరగతి పాస్ అయిన వారందరు అర్హులు.
ఇది కూడా చదవండి..
గ్రూప్ 4 దరఖాస్తులు గడువు పెంపు ...
ఈ పరీక్ష సమయం బీవచేసి రెండు గంటలు. ఈ పాలీసెట్ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో మాథెమాటిక్స్ నుండి 50, ఫిజిక్స్ నుండి 40, కెమిస్ట్రీ నుండి 30 ముల్టీపిల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఏ పరీక్షకు నెగటివ్ మార్కింగ్ లేదు. ఏపీ స్టేట్ బోర్డ్ పదో తరగతి సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చెప్పున మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఈ పాలీసెట్ పరీక్ష దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 30. పరీక్ష మే 10వ తేదీన జరగనుంది. ఫలితాలు మే 25న విడుదల అవుతాయి.
ఇది కూడా చదవండి..
Share your comments