Education

గ్రూప్ 4 దరఖాస్తులు గడువు పెంపు ...

Srikanth B
Srikanth B
TSPSCc group 4 notification
TSPSCc group 4 notification

 

గ్రూప్ 4 దరఖాస్తులు గడువును సర్కారు పెంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 30 తో ముగియనుంది. సర్వర్ మొరాయించడం, కొన్ని బీసీ గురుకులాల్లో అదనంగా పోస్టులు పె రగడం, గడువు పెంచాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల దాకా అప్లై చేసుకునేందుకు చాన్స్ కల్పిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం సాయంత్రం నాటికి 8,47,277 దరఖాస్తులు అందాయని కమిషన్ వెల్లడించింది.

 

TSPSC డిసెంబర్ మొదటి వారం లో 9,168 గ్రూప్-IV ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అయితే డిసెంబర్ 18 నుండి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉండగా .. సాంకేతిక లోపల కారణముగా దరఖాస్తుల స్వీకరణను ఈనెల డిసెంబర్ 30 కి వాయిదా వేసింది , దీనితో దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 30 నుంచి ప్రారంభమై జనవరి 30 తో ముగిసింది అయితే సాంకేతిక లోపాలతో దరఖాస్తు చేసుకొని అభ్యర్థులకు గడువును పిబ్రవరి 3 కి పెంచుతో మరొక అవకాశం ఇచ్చింది .


గత నెల జారీ చేసిన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో 1,862 వార్డు ఆఫీసర్లు, ఫైనాన్స్ విభాగాల్లో 18 జూనియర్ ఆడిటర్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

LIC లో 300 AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. దరఖాస్తు చేసుకోండి ఇలా !

ఖాళీల వివరాలు ;

  • 6,859 జూనియర్ అసిస్టెంట్

  • అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్‌లో 44

  • పశుసంవర్ధక మరియు మత్స్యశాఖలో రెండు

  • బీసీ సంక్షేమంలో 307, పౌర సరఫరాలలో 72

  • ఎనర్జీలో 2

  • పర్యావరణం మరియు అడవులలో 23
  • ఫైనాన్స్‌లో 46

  • సాధారణ పరిపాలనలో 5
  • 338 ఆరోగ్యం మరియు వైద్యం
  • ఉన్నత విద్యలో 742

  • గృహంలో 133

  • పరిశ్రమలు మరియు వాణిజ్యంలో ఏడు, నీటిపారుదలలో 51

  • కార్మిక మరియు ఉపాధిలో 128

  • మైనారిటీ సంక్షేమంలో 191

  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 601

  • పంచాయతీ రాజ్‌లో 1,245

  • ప్లానింగ్‌లో 2

  • ఎస్సీ డెవలప్‌మెంట్‌లో 97

  • సెకండరీ ఎడ్యుకేషన్‌లో 97

  • రవాణా, రోడ్లు మరియు భవనాల్లో 20

  • మరియు గిరిజన సంక్షేమంలో 221

  • స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖలలో 18 ఉన్నాయి.
  • LIC లో 300 AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. దరఖాస్తు చేసుకోండి ఇలా !

Related Topics

TSPSC GROUP 1

Share your comments

Subscribe Magazine