Education

Central Tribal University of AP: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు!

Srikanth B
Srikanth B

 

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త . : ఇంటర్/డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు భర్తీకి యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి .

 

Non-Teaching Jobs in Central Tribal University of Andhra Pradesh
Non-Teaching Jobs in Central Tribal University of Andhra Pradesh

ఖాళీల వివరాలు :

అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 1
సెక్షన్ ఆఫీసర్ పోస్టులు:1
ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు:1
జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు: 1
టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) పోస్టులు: 1
అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 2
స్టెనోగ్రాఫర్ పోస్టులు: 2
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1
సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు: 1

రేడియో డయాగ్నోసిస్‌, క్యాజువాలిటీ, యూరాలజీ, ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

విద్య అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

SSC రిక్రూట్‌మెంట్ 2022: 70000 కంటే ఎక్కువ ఖాళీలు, ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 10, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్: The Recruitment Cell, Central Tribal University of Andhra Pradesh Kondakarakam, Vizianagaram (AP) 535003.


నవంబర్ 20వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో పోస్టును బట్టి జనరల్‌ అభ్యర్ధులు రూ.2000ల నుంచి రూ.1000ల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.1000ల నుంచి రూ.500ల వరకు ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష/ అటెండింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి !

Share your comments

Subscribe Magazine

More on Education

More