Education

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ!

S Vinay
S Vinay

తెలంగాణ ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలను చేపట్టనున్న తరుణనంలో కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (CIE) ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను ఏర్పాటు చేయనుంది

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (CIE) పిచ్ చేసింది. దీని ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను అందించాలని కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 24న ముగిసిన వెటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పోలీసు శిక్షణా కేంద్రాల ఉచిత కోచింగ్ ప్రారంభమవుతుంది. దీని కొరకై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు, నోడల్ అధికారులను అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు.ఇందులో 50 మంది బాలురు మరియు 50 మంది బాలికలకు అవకాశం ఇవ్వనున్నారు.అయితే అభ్యర్థుల ఎత్తు, బరువు మరియు వయస్సు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్ పరీక్షల అనంతరం శిక్షణ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్‌లలో శిక్షణ ఇస్తారు.మరియు ఫిజికల్ ఫిట్‌నెస్ పై అవగాహనా కల్పించనున్నారు.అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో కీలక పాత్ర వహించే రాత పరీక్షల గురించి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వంటి సబ్జెక్టుల పై అవగాహన కల్పించనున్నారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకి మాత్రమే అందించనున్నారు.

మరిన్ని చదవండి.

నిరుద్యోగుల పోటీ పరీక్షల కొరకు 'వారధి' యాప్!

 

Share your comments

Subscribe Magazine