Education

ఇంట్లోనే ఆర్గానిక్ హోలీ రంగులు తయారుచేసుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff

మరో మూడు రోజుల్లోనే హోలీ పండుగ. భారత దేశం వీధులన్నీ రంగులతో నిండి కళాకలాడబోతున్నాయి. హోలీ పండుగను కేవలం ఒక్క రాష్ట్రంవారే కాకుండ భారత దేశమంతా ఐకమత్యంగా జరుపుకునే పండుగ. వసంత మాసాన్ని ఆహ్వానిస్తూ హోలీ పండుగ జరుపుకుంటాం. సాధారణంగా హోలీని పసుపు నీళ్లతో ఆడుకోవడం ఆనవాయితీ, పసుపు యాంటిసెప్టిక్గా పని చేసి శరీరం మీద ఉన్న క్రిములను సంహరించడంలో సహాయపడుతుంది.

ఐతే ఈమధ్య కాలంలో రంగులతో హోలీ ఆడుకోవడం ఫ్యాషన్ గా మారింది. మార్కెట్లో దొరికే ఈ రంగులు కొన్ని రసాయనాలతో కూడి శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. చాల మందిలో స్కిన్ అలెర్జిస్, అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకునే హోలీ ఈ రసాయన రంగులకు భయపడి మానుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి శ్రమతో ఇంట్లోనే సహజసిద్ధమైన రంగులను తయారుచేసుకోవచ్చు.

గులాబీ రేకులతో పింక్ కలర్:

ముందుగా గులాబీ రేకులని ఎండలో బాగా ఎండనిచ్చి, మిక్సర్లో వేసి మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఆడించుకున్న బియ్యపు పిండిని ఈ గులాబీ రేకులతో కలిపితే పింక్ కలర్ హోలీ ఆడటానికి తయారవుతుంది.

బీట్రూట్ తో ఎరుపు రంగు:

అన్ని రంగుల్లోకల్లా ఎరుపు రంగు అందరికి ఎంతో ఇష్టమైనది. ఎరుపు రంగు రంగు లేకపోతే హోలీ అసంపూర్ణం. ఈ రంగుకు బీట్రూట్ ముక్కలు ఎండబెట్టి మెత్తని పొడిలాగా చెయ్యాలి, తర్వాత మెత్తని బియ్యపు పిండిలో కలిపితే ఎరుపు రంగు హోలీ ఆడటానికి సిద్ధం అవుతుంది.

నారింజ రంగు:

నారింజ రంగును తయ్యారు చేసుకోవడానికి ఎండిన బంతిపువ్వు రేకలు పొడిలాగా గ్రైండ్ చేసి బియ్యపు పిండిలో కలుపుకుంటే నారింజ రంగు తయారవుతుంది.

చివరిగా యాంటిసెప్టిక్ గా పనిచేసే పసుపును హోలీ రంగుల్లో చేర్చడం ద్వారా శరీరం మీద వచ్చే సమస్యలను తగ్గించడానికి వీలవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే ఆర్గానిక్ హోలీ రంగులను తయారుచేసుకుని ఆరోగ్యకరమైన హోలీ పండుగను జరుపుకోండి.

చర్మ వ్యాధులతో భాద పడుతున్నారా... వీటిని పాటించి చర్మ సమస్యలు దూరం చేసుకోండి.

సరైన నిద్ర లేకపోతే షుగర్ వస్తుందా???

Share your comments

Subscribe Magazine