Education

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఉద్యోగాలు 10 వ తరగతి పాస్ అయిన వారికీ అవకాశం !

Srikanth B
Srikanth B

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఖాళీగా ఉన్న పోస్థుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది దానిలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు AAI యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు https://www.aai.aero/. ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్ PDF ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 156 పోస్టులు భర్తీ చేయబడతాయి. పోస్టుల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, అర్హత, వయోపరిమితి వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 1 సెప్టెంబర్

దరఖాస్తుకు చివరి తేదీ - 30 సెప్టెంబర్

ఖాళీల వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య- 156

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) NE-4 లో 132 పోస్టులు..

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) NE-4 లో 10 పోస్టులు..


సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) NE-6లో 13 పోస్టులు


సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) NE-6లో 1 పోస్టు

అర్హత ప్రమాణాలు:

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) - అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ.

సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) - 3 లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్.

సీనియర్ అసిస్టెంట్ (రాజ్‌భాష) - ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు రుసుము..

UR/OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1000 చెల్లించాలి.

SC/ ST/ మహిళలు/ ఎక్స్-సర్వీస్‌మెన్/ PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

వయోపరిమితి (25-08-2022 నాటికి)

కనిష్ట వయో పరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు

వేతనం:

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్, & రెగ్యులేషన్స్ ప్రకారం బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, పెర్క్‌లు, హెచ్‌ఆర్‌ఏ మరియు CPF, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, మెడికల్ బెనిఫిట్‌లు మొదలైన ఇతర ప్రయోజనాలతో పాటు అనుమతించబడతాయి.

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) NE-4: రూ. 31000-92000

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) NE-4: రూ. 31000-92000

సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) NE-6: రూ. 36000-110000

సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) NE-6: రూ 36000-110000

దరఖాస్తు ప్రక్రియ ఇలా:

  •  ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలి. దానిలోని కెరీర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
  •  దీనిలో Online Registration & Objection Link అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అయితే ఈ లింక్ యాక్టివేట్ లో లేదు. సెప్టెంబర్ 1 నుంచి ఇది అందుబాటులో రానుంది.
  • దీనిలో పేర్కొన్న ప్రతీ అంశానికి సంబంధించి వివరాలను అభ్యర్థులు నమోదు చేయాలి. తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
  •  ఇక చివరగా దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని తమ వద్ద ఉంచుకోవాలి.
  • " తెలంగాణ వ్యాప్తంగ ఉచితంగ చేప పిల్లల పంపిణీ "- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Share your comments

Subscribe Magazine

More on Education

More