జూన్ 12న జరగాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షను వాయిదా వేయాలని వస్తున్న వినతులపై, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి పూర్తి వివరణ ఇచ్చారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 26 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12 వరకు కొనసాగింది. ఇక టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు అధికారకంగా వెల్లడించారు.టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అయితే అభ్యర్థుల వినతుల వెనక సరైన కారణమే ఉంది, టెట్ పరీక్ష నిర్వహిస్తున్న అదే రోజున కేంద్ర ప్రభుత్వ రైల్వే పరీక్ష ఉంది. కావున ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభర్ధులు సందిగ్ధంలో పడ్డారు.
ఆ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు. పవన్ కుమార్ అనే ఒక అభ్యర్థి దీని గురించి మంత్రి కేటీఆర్ కుట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఈ విషయాన్ని పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డిని ట్విట్టర్ ద్వారా కోరారు.
ఈ విషయం పై మంత్రి సబితా వివరణ ఇస్తూ టెట్ పరీక్షకు దాదాపు 3.5 లక్షల మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలోని ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ తో విభేదించకుండా ప్రణాళిక చేయబడ్డాయి. అన్ని పరీక్షా తేదీలు ఇతర పోటీ పరీక్షలతో ఏకీభవించకుండా జాగ్రత్తగా ఎంపిక చేయబడతాయి.అయితే అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, టెట్ పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది డిపార్ట్‌మెంట్ యొక్క ఇతర సన్నాహాలపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. అయితే అభ్యర్థులు పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని గమనించగలరు జూన్ 12న తెలంగాణలో టెట్ పరీక్ష జరగనుంది.
మరిన్ని చదవండి
Share your comments