Education

NABARD Recruitment: చివరి అవకాశం.. నాబార్డు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

Srikanth B
Srikanth B
NABARD Recruitment2022
NABARD Recruitment2022

ప్రముఖ జాతీయ బ్యాంకింగ్ రంగ సంస్థ నాబార్డు ఖాళీగా గ వున్నా వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది.దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో ముగియనుంది అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి .

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ (173), డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌(హిందీ) (04) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయసు 01-09-2022 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు!

దరఖాస్తు చేసుకుని విధానం :

అధికార వెబ్సైటు :https://www.nabard.org/careers
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ. 32,000 జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 15-09-2022న మొదలవగా 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు!

Share your comments

Subscribe Magazine