ఆంధ్రప్రదేశ్‌లో 411 SI ఉద్యోగాల కోసం కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి మన అందరికి తెలిసిందే. ఈ మంచి అవకాశం కోసం 1,51,288 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ (APSLPRB) ద్వారా నిర్వహించనున్న ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు మొత్తం 57,923 మంది అభ్యర్థులు విజయవంతంగా అర్హత సాధించారు.
ఈ అర్హత కలిగిన అభ్యర్థులలో 49,386 మంది పురుషులు కాగా, 8,537 మంది మహిళలు ఉన్నారు. APSLPRB ఇటీవలే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వంటి ఫిజికల్ ఈవెంట్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది.
ఈ ఈవెంట్లను గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు, కర్నూలు నగరాల్లో జరపనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆయా సెంటర్లలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. PMT/PET పరీక్షలకు సంబంధించిన కాల్ లెటర్‌లను ఆగస్టు 14 నుండి అధికారిక వెబ్‌సైట్ (https://slprb.ap.gov.in/) నుండి పొందవచ్చని బోర్డు చేసిన ప్రకటన పేర్కొంది. అభ్యర్థులంతా ఆ తేదీ నుంచి తమ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి..
పెరిగిన వంట నూనె దిగుమతి ...
ఈవెంట్‌లలో పాల్గొనే ప్రతి అభ్యర్థి తమతో పాటు స్టేజ్ 2 దరఖాస్తు ఫారమ్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని బోర్డు తెలిపింది. AP పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవల SSI ఉద్యోగాల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించింది. ఫిజికల్ ఈవెంట్స్ ముగిసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. దీని తరువాత సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments