News

పెరిగిన వంట నూనె దిగుమతి ...

Srikanth B
Srikanth B
పెరిగిన వంట నూనె దిగుమతి ...
పెరిగిన వంట నూనె దిగుమతి ...

వెజిటబుల్‌ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రకటించింది.

2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022-23లో తొలి తొమ్మిది నెలల సీజన్‌లో (నవంబర్‌-అక్టోబర్‌) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు ..

దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్‌ తిరిగి పెరిగినట్టు ఎస్‌ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని తెలిపింది . పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోంది. సన్‌ఫ్లవర్‌ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్‌ నుంచి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు ..

Related Topics

cooking in rice cooker

Share your comments

Subscribe Magazine