Education

10 వ తరగతి అర్హతతో పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల ..

Srikanth B
Srikanth B
Post office jobs 2023
Post office jobs 2023

ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న యువతకు భారతదేశ తపాలా కార్యాలయం శుభవార్త అందించింది , పదోవ తరగతి అర్హతతో దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది అర్హత కల్గిన అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో దరకాస్తు లను సమర్పించాలి .

ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 2,391 పోస్టులను భర్తీకి ఆమోదం ..

 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి పూర్తి వివరాలకు www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

మరోవైపు LIC లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తు లను స్వీకరిస్తుంది.మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .

తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 2,391 పోస్టులను భర్తీకి ఆమోదం ..

Related Topics

JOB NOTIFICATION

Share your comments

Subscribe Magazine

More on Education

More