Education

#PPC2023: జనవరి 27న పరీక్ష పే చర్చ’లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి: ప్రధానమంత్రి పిలుపు...

Srikanth B
Srikanth B
#PPC2023
#PPC2023

ఈ ఏడాది ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక చర్చలో పాలుపంచుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , పిలల్లపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి మరియు విద్యార్థులను ప్రోత్సహించడానికి వారి ఆలోచనలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన వేదిక పరీక్షా పే చర్చ. జనవరి 27న, ప్రధాని మోదీ వార్షిక పరీక్షా పే చర్చా సందర్భంగా విద్యావేత్తలు, తల్లిదండ్రులు మరియు పిల్లలతో సంభాషణలో పాల్గొంటారు. తల్కటోరా ఇండోర్ స్టేడియం లో ఈ కార్యక్రమం నిర్వహించనున్న ప్రభుత్వం పిల్లలు , తల్లి తండ్రులు పెద్ద మొత్తం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు .

ప్రతి సంవత్సరం, పరీక్షా పే చర్చా సందర్భంగా, రాబోయే బోర్డ్ పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులతో మోడీ నిమగ్నమై ఉంటారు. పరీక్షల ఒత్తిడి మరియు ఇతర అంశాలపై ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా అతను సమాధానమిస్తాడు.

PM-SHRI Yojana: పీఎం శ్రీ యోజన స్కీమ్.. ఆధునీకరణ దిశగా ప్రభుత్వ పాఠశాలలు

ఫిబ్రవరి 16, 2018న, హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థులతో ప్రధానమంత్రి ఇంటరాక్టివ్ సెషన్‌లో నిర్వహించారు .

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పరీక్ష పే చర్చ’ అన్నది అత్యంత ప్రయోజనకర కార్యక్రమాలలో ఒకటి. పరీక్షల వేళ ఒత్తిడిని దూరం చేయడానికి, మన విద్యార్థులకు (#ExamWarriors) మద్దతివ్వడానికి వీలున్న మార్గాలపై చర్చకు ఇది అవకాశమిస్తుంది. ఈ నెల 27న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ప్రత్యేక చర్చలో పాల్గొనాలని కోరుతున్నాను. #PPC2023” అని ప్రధాని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు .

PM-SHRI Yojana: పీఎం శ్రీ యోజన స్కీమ్.. ఆధునీకరణ దిశగా ప్రభుత్వ పాఠశాలలు

Related Topics

#PPC2023 PM narendra

Share your comments

Subscribe Magazine