రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటారు. కానీ విదేశాల్లో చదవాలంటే ఖర్చు ఎక్కువగా అవుతుందని, పేదా మరియు మధ్య తరగతి విద్యార్థులు వారి ఆశలను వదిలేసుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అండగా నిలిచి, వారి కలలను సహకారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
కానీ చాలా మంది విద్యార్థులకు ఈ పథకాలపై అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. విద్యార్థుల యొక్క ఆఖరి సంవత్సరంలో ఈ విదేశీవిద్య గురించి ప్రభుత్వం అవగాహన చర్యలు తీసుకుంటే విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునేందుకు ఆశక్తి చూపుతారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2014-15 సంవత్సరం నుండి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మైనార్టీలకు 2015-16 ఏడాది నుండి ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని మరియు బీసీ విద్యార్థుల కొరకు 2018 సంవత్సరం నుండి మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి అనే పథకాలను విద్యార్థుల కొరకు అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది. ఈ పథకాల ద్వారా విద్యార్థులు రూ. 20 లక్షల వరకు స్కాలర్షిప్ ను పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా రద్దు .. జూన్ 11 తిరిగి ప్రిలిమ్స్ పరీక్షా !
విద్యార్థులు ఈ పథకం ద్వారా మొత్తానికి పది దేశాలకు చదువు కోసం వెళ్ళడానికి అనుమతి కల్పిస్తున్నారు. అవి ఏమి దేశాలు అంటే కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్. ఈ దేశాల్లో మాత్రమే విద్యార్థులకు విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ఈ దేశాల్లో వివిధ పీజీ కోర్సులైన వ్యవసాయం, హ్యూమానిటీస్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటివి చదవచ్చు.
ఈ పథకానికి విద్యార్థులు అర్హులు కావాలంటే ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థుల యొక్క వయస్సు అనేది 35 సంవత్సరాల లోపు ఉండాలి. వారి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది రూ.5లక్షల కన్న తక్కువ ఉండాలి. దీనితోపాటు వారి డిగ్రీ కోర్సుల్లో 60 శాతం పైగా మార్కులు ఉండాలి. టోఫెల్‌లో 60శాతం ఉతీర్ణత, ఐఈఎల్టీటీఎస్ 80మార్కులు, పీఈటీలో 50శాతం, జీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు.
ఇది కూడా చదవండి..
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా రద్దు .. జూన్ 11 తిరిగి ప్రిలిమ్స్ పరీక్షా !
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు, ఆధార్ కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్, పీజీ మార్కుల సర్టిఫికట్లు ఇవ్వాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతిపత్రం, ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు కూడా ఉండాలి. పత్రానికి రూ.10 విలువైన నాన్ జ్యూడిషియల్ స్టాంపును అతికించి, రిజిస్ట్రార్ సంతకం చేయించి దరఖాస్తు సమర్పించాలి.
ఇది కూడా చదవండి..
Share your comments