కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుల కోసం నిర్వహించే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 పరీక్షా నోటిఫికేషన్ విదుదల అయ్యింది. మొత్తం 3712 ఉద్యోగాల నియామకానికి షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ పరీక్ష ద్వారా దేశంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. దేశమలోని వివిధ కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలో, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డివిషనల్ క్లర్క్స్ స్థానాలకు, ఈ పరీక్షల ద్వారా భర్తీ చెయ్యనున్నారు.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు, ఆన్లైన్లో మే 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఈ పరీక్ష మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటి రెండు పరీక్షలు టైర్-1, టైర్-2 పరీక్షలుగా విభజిస్తారు, మూడోవ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ద్వారా క్యాండిడేట్లను ఎంపిక చేస్తారు.
టైర్- 1 పరీక్ష జూన్-జులై నెలల్లో నిర్వహిస్తారు, పరీక్ష ముగిసాక టైర్-2 పరీక్ష తేదీలను తెలియపరుస్తారు. ఈ రెండు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించబడతాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ళు ఉండాలి. ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. దివ్యంగులకు 10-15 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది. మరియు పరీక్ష రుసుము ఓబీసీ అబ్యర్ధులు , 109 రూపాయిలు, చెల్లించాలి. మహిళలు, దివ్యంగులు, ఎస్సీ,ఎస్టీ, అభ్యర్థులకు పరీక్ష రుసుము ఉండదు.
ఎంపికైన అబ్యర్ధులకు జీతభత్యాలు ఈ విధంగా ఉన్నాయి,
ఎల్డిసి , జేఎస్‌ఏ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900-63,200 ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, 25,500-81,100 ఒక నెలకు జీతం ఉంటుంది.
డేటా ఎంట్రీ గ్రేడ్-ఏ పోస్టులకు ఐతే 29,900-92,300 వేతనం ఉంటుంది.
Share your comments