Education

AP Inter Results 2024: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల.... ఎప్పుడంటే ....

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్లో ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసాయి. వీటి ఫలితాల కోసం అటు తల్లితండ్రులు ఇటు విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలను ఆధారం చేసుకుని, పై చదువులకు ప్రవేశాలు మరియు ఇతర పోటీ పరీక్షలు ముడిపడి ఉన్నాయి.

ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 1 నుండి 20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ పరీక్షలకు సంబంధించి, జవాబు పాత్రలు మూల్యంకన ఇప్పటికే పూర్తయింది, ప్రస్తుతం ప్రశ్న పాత్రల పునఃపరిశీలన, ఆన్లైన్ లో మార్కులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెల్సుతుంది. దిన ద్వారా వచ్చే వరం కానీ ఏప్రిల్ ఆఖరి లోపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకూండా ఏపీలో సార్వత్రిక, మరియు లోకసభ ఎన్నికలు ఉన్నందున అధికారులు త్వరితగతిన ఫలితాలను విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండొవ సంవత్సరం ఫలితాలు ఒకేరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

భవిష్యత్తుకు ఇక్కడి నుండే పునాది

ఇంటర్మీడియట్ ఫలితాలు ఆధారం చేసుకుని, కొన్ని యూనివర్సటీలలో ప్రవేశాలు, పలు పోటీ పరీక్షల ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు. వృత్తివిద్యా, డిగ్రీ కోర్సులు చేసి భవిష్యత్తులో స్థిరపడేందుకు ఇంటర్మీడియట్ ముఖ్యమైన, పునాదిగా నిలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ, సెంట్రల్ గోవేర్నమేంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ను ఆధారంగా చేసుకొని ప్రవేశాలకు అనుమతిస్తారు.

Share your comments

Subscribe Magazine