Education

CTET 2024: పరీక్షకు అప్లై చేసారా? ఇవాళే ఆఖరి తేదీ......

KJ Staff
KJ Staff

ఉపాధ్యాయవృత్తిలో స్థిరపడాలనుకునేవారి కోసం సిబిఎస్సి ప్రతీ సంవత్సరం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. సెంట్రల్ సిలబస్ బోధించే పాఠశాల్లో ఉపాధ్యాయ అర్హతను ఈ CTET పరీక్షా ద్వారా సంపాదించవచ్చు. ఈ [పరీక్షా సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించబడుతుంది. జులై సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకోవాలన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

CTET పరీక్ష ఆఫ్-లైన్ విధానంలో నిర్వహిస్తారు. అయితే జులై పరీక్షకు నోటిఫికేషన్ మార్చ్ నెలలోనే వెలువడింది, దరఖాస్తుకు మార్చ్ 8 నుండి ఏప్రిల్ 2 అంటే ఈ రోజు వరకు అవకాశం ఉంటుంది. పరీక్షను మొత్తం రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒకటి నుండి 5వ తరగతికి భోదించాలనుకున్న వారు పేపర్-1 రాయాలి. ఆరు ఆపై తరగతులకు భోధన అర్హత కోసం పేపర్-2 రాయవలసి ఉంటుంది. CTET పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు, అభ్యర్థులు తమ సౌలభ్యం బట్టి పరీక్ష భాషను ఎంచుకోవచ్చు. అయితే ఈ పరీక్షకు అప్లై చేసుకోదలచిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా సాధించిన స్కోర్ జీవితం కాలం చెల్లుబాటవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాలకు ఈ స్కోర్ ని పరిగణలోకి తీసుకుంటారు.

Share your comments

Subscribe Magazine