Education

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది

KJ Staff
KJ Staff

తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలని ఎంతోమంది తల్లితండ్రులు చూస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునేందుకు విద్యార్థి తల్లితండ్రుల్లో ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఉండాలి. కేంద్రీయ విద్యాలయాలు భారత దేశం మొత్తం అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, మరియు అన్ని స్కూల్స్ ఒకే విధమైన సిలబస్ ఫాలో అవుతాయి. నాణ్యమైన విద్యను అందించడమే కేంద్రీయ విద్యాలయాల ప్రధాన ఉదేశ్యం.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తరగతి, ప్రవేశాలకు, గురువారం రాత్రి షెడ్యూల్ విడుదలైంది. ఒకటవ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 1, ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ 15, సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందాలకున్న విద్యార్థి వయసు 2024 మార్చ్ 31 నాటికి, ఆరేళ్ళు పూర్తయి ఉండాలని కేవీ సంగతాన్ ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుండి 11 తగరతి వరకు ప్రవేశాల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారి మొదటి ప్రొవిజినల్ లిస్ట్ ఏప్రిల్ 19 న విడుదల చేస్తారు. మొదటి ప్రోవిషనల్ లిస్ట్ అనంతరం సీట్ల ఖాళీని బట్టి రెండొవ జాబితా ఏప్రిల్ 29న విదుదల చేస్తారు, మూడోవ ప్రోవిషనల్ లిస్ట్ మే 8న విడుదల చెయ్యనున్నట్లు కేవీఎస్ పేర్కొంది. అలాగే రెండవ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుండి ఏప్రిల్ 10 సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

రెండవ తరగతికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 15 న ప్రకటిస్తారు. మిగిలిన తరగతుల్లో అడ్మిషన్ కోసం జూన్ 29 వరకు గడువు ఉంది. ఇక 11వ తరగతి అడ్మిషన్ కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన పది రోజుల్లోపు రిజిస్ట్రేషన్ పూర్తిచెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన 20 రోజుల్లో 11వ తరగతికి ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం కేవీఎస్ ఆఫీసియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. https://kvsangathan.nic.in/

Share your comments

Subscribe Magazine