Education

అగ్రికల్చర్ స్టార్ట్ అప్ వ్యవస్థాపకులకు శుభవార్త : UPJA & ARISE ప్రోగ్రామ్ ద్వారా 25లక్షల నిధులు వరకు పొందే అవకాశం

KJ Staff
KJ Staff

ఎంతో మంది యువత వ్యవసాయాన్ని తమ జీవనోపాధిగా మార్చుకుని అపూర్వ విజయాలు సాధిస్తున్నారు. వ్యసాయానికి సాంకేతికత తోడైతే ఎన్నో అద్భుతాలు చెయ్యచ్చు. సాంకేతికతను వ్యవసాయానికి జోడించడానికి ప్రస్తుతం ఎన్నో అగ్రికల్చర్ స్టార్టుప్ కంపెనీలు విశేషమైన కృషి చేస్తున్నాయి. చాల మందికి అగ్రికల్చర్ స్టార్టుప్ కామపిణీలు స్థాపించాలి అనే కోరిక ఉన్న ఆర్ధిక సహకారం లేక ఆ కోరిక ఒక కలలానే మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు ఆ కల నిజం చేసేందుకు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) స్టార్టుప్ ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టనుంది. UPJA మరియు ARISE ప్రోగ్రామ్స్ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనాకు సహాయంగా 25లక్షల వరకు నిధులు మంజూరుచేస్తారు.

ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 1 నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, స్టార్టుప్ కంపెనీ మొదలు పెట్టాలి అనుకున్న విద్యార్థులు సైతం ఈ కార్యాక్రమినికి రిజిస్టర్ అయ్యి నాలుగు లక్షల వరకు సహాయ నిధులు పొందే అవకాశం. కేవలం అగ్రికల్చర్ విద్యార్థులే కాక, వ్యవసాయ రంగంపై ఆశక్తి ఉన్న వారు ఎవరైనా సరే ఈ కార్యక్రమాల ద్వారా తమ సంస్థల ప్రారంభానికి నిధులను పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:

  • స్టార్టుప్ ఐడియా ఉన్న ఆవిష్కర్తలు
  • తొలి దశలో ఉన్న స్టార్టుప్ కంపెనీలు.
  • స్టార్టుప్ కంపెనీ ప్రారంభించి ఇంకా నమోదు చేసుకొని విద్యార్థులు.
  • ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన స్టార్టుప్ కంపెనీల వ్యవస్థాపకులు.

UPJA & ARISE కార్యక్రమాల గురించి క్లుప్తంగా:

UPJA: ఈ కార్యక్రమం ఇప్పటికే తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్న వ్యవసాయ స్టార్టుప్ వ్యస్థాపకుల కోసం రూపొందించబడింది. UPAJ కార్యక్రమం అగ్రి స్టార్టుప్స్ ద్వారా వ్యవసాయ సాంకేతికతను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ వ్యాపార అభివృద్ధికి 25 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తారు. అంతేకాకుండా మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన కీలక సమాచారాన్ని, మరగదర్శకాన్ని అందిస్తారు.

ARISE: వ్యవసాయ అవసరాలు తీర్చడానికి వినూత్న ఆలోచలను కలిగి ఉన్న ఔత్త్సహికులకు, వ్యవసాయ పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణను, మార్కెటింగ్ విధానాలను, బోధిస్తారు. అలాగే స్టార్టుప్ మొదలుపెట్టడానికి 5 లక్షల వరకు సహాయక నిధులు అందచేస్తారు.

ఏప్రిల్ 1వ తారీఖు నుండి మొదలయ్యే, ఈ కార్యాక్రమానికి నమోదు చేసుకోవాలి అనుకునేవారు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా నమోదుచేసుకోండి https://pusakrishi.accubate.app/ext/form/1980/1/apply

మరింత సమాచారం కోసం ఆఫీసియల్ వెబ్సైట్- https://pusakrishi.in లేదా ఫోన్ 8700183709, 9910605121 ద్వారా నేరుగా సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

Share your comments

Subscribe Magazine