Education

నిరుద్యోగులకు శుభవార్త ... మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల !

Srikanth B
Srikanth B

తెలంగాణలో ఉద్యోగాల   భర్తీకి నోటిఫికేషన్ ల మీద నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది . ప్రభుత్వం విడతలవారీగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఆర్థిక శాఖ అనుమతులు పొందిన  పోస్టులకు వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా మరో 931 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈ పోస్టుల్లో 704 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు, 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులు ఉన్నాయి.

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో మెకానికల్ 84, సివిల్‌ 320, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 100,  ఎలక్ట్రికల్‌ పోస్టులు 200 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు డిప్లోమా, ఏఈఈ పోస్టులకు బీటెక్ విద్యార్హత కలిగి ఉండాలి. ఏఈ పోస్టుల్లో మల్టీజోన్‌-1 (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు)పరిధిలో 259 పోస్టులు, మల్టీజోన్‌-2 (యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు) పరిధిలో 445 పోస్టులు ఉన్నాయి.

ఏఈఈ పోస్టుల్లో 182 సివిల్ ఇంజనీర్ పోస్టులు కాగా, మరో 45 మెకానిల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో మల్టీజన్ 1 పరిదిలో 112, మల్టీజోన్ 2 పరిధిలో 115 పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు రోజుల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన జీవో వెలువడే అకవాశం ఉంది.

ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్ సహా పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా నీటిపారుదల శాఖలో ఏఈ, ఏఈఈ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ : 12.5 లక్షల బస్తాలు వరకు వరి ఉత్పత్తి తగ్గవచ్చు !

Share your comments

Subscribe Magazine

More on Education

More