Education

TS DSC Mega Notification 2024 : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం: 11,062 పోస్టుల నియామకానికి సన్నాహం .

KJ Staff
KJ Staff

తెలంగాణ నిరుద్యోగ యువతకు, మంచి అవకాశం. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన నివాసంలో విడుదల చెయ్యనున్నారు. మొత్తం 11,602 పోస్టులకు ఉపాధ్యాయుల నియామకానికి, వచ్చే మే లేదా జూన్ నెలల్లో ఆన్లైన్ పద్దతిలో పరీక్షలు జగనున్నాయి. పూర్తి వివరాలు మీకోసం.

Source : Hans India
Source : Hans India

మెగా డీఎస్సీ నోటిఫికేషన్:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ఎన్నికల హామీలో లో ప్రకటించింది. దినికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఉపాధ్యాయుల నియామకానికి, 11,062 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. 2023 లో డీఎస్సీ ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫెక్షన్ విడుదల చెయ్యగా, ప్రభుత్వం మారిన తర్వాత, ప్రతి బడికి ఉపాద్యాయుడు ఉండాలి అని సీఎం ఆదేశాల మేరకు, విద్య శాఖ గత రెండు వారాలుగా కసరత్తు చేసి ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ పూర్తి చేసింది. ఈ సారి నోటిఫికేషన్లో పోయిన సారి తో పోలిస్తే మరికొన్ని ఎక్కువ పోస్టులను కలిపారు. గత సంవత్సరం నోటిఫికేషన్ తర్వాత మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పోస్టులు పెరిగిన కారణంగా ఈ సారి మరింత ఎక్కువ దరఖాస్తులు రావచ్చు అని అంచనా వేస్తున్నారు.

మళ్ళి దరకాస్తు చేసుకోవాలా?

పోయిన సంవత్సరం డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తాజాగా విడుదల చేసే పోస్టులకు దరకాస్తు చేసుకోవాలా, లేదా అనే సంకోచంలో పడ్డారు. దినికి అనుగుణంగా విద్య శాఖ పోయిన సారి దరకాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళి కొత్తగా చెయ్యవలిసిన అవసరం లేదు అని స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు :

మొత్తం 11,062 పోస్టులకు గాను,

స్కూల్ అసిస్టెంట్స్- 2,629,

భాష పండితులు -727,

పీఈటీ లు -182,

ఎన్జిటీ లు - 6,508,

మరియు ప్రత్యేక కేటగోరీలలో

స్కూల్ అసిస్టెంట్స్- 220,

ఎన్జిటీ- 796 పోస్ట్లు ఉన్నాయ్.

ఈ పోస్టుల ధరకాస్తుకు, గడువును, నియమాలను, విద్య శాఖ వెల్లడించనున్నారు. ఐతే ఆన్లైన్ పరీక్షలు మాత్రం మే లేదా జూన్ నెలల్లో జరగనున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు పునరః వైభవం:

వచ్చే విద్య సంవత్సరరానికి అల్లా టీచర్ల నియామకాన్ని పూర్తి చేసి పెద్ద ఎత్తున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. డీఎస్సీ తో ప్రభుత్వ పాఠశాల్లలో ఉపాధ్యాయుల కొరత తగ్గించాలి అని విద్య శాఖ చూస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, రాష్ట్రంలో ఏఏ పాఠశాలల్లో వసతులు అవసరమో ఆ నివేదికను విద్య శాఖ సేకరించింది.

Share your comments

Subscribe Magazine