Education

TS EAMCET 2023 Hall tickets: EAMCET హాల్ టికెట్ విడుదల, లేట్ ఫీజు అప్లికేషన్ ఈరోజు చివరి తేదీ.

KJ Staff
KJ Staff

వివిధ విభాగాలకు సంబంధించిన EAMCET పరీక్షలు మే 10 నుండి ప్రారంభం కానుండగా, తెలంగాణ EAMET-2023 పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్‌లను ఉన్నత విద్యామండలి ఇటీవల విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్‌లను Eamcet అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవలసి ఉంటుంది. https://eamcet.tsche.ac.in/. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడిసిన్ పరీక్షలు మే 10-11 మరియు మే 12-14 మధ్య నిర్వహించబడతాయి.

మీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు కింది స్టెప్స్ ను అనుసరించండి .

ముందు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి .

హోమ్ పేజీకి నావిగేట్ చేసి "డౌన్‌లోడ్ హాల్ టికెట్ (E & AM)" అని ఉన్న లింక్‌ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది . తర్వాత , "గెట్ హాల్ టికెట్" అనే దాని పై క్లిక్ చేయాలి .

మునుపటి దశలను పూర్తి చేసిన తర్వాత, మీ హాల్ టిక్కెట్ మీ కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. మీరు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ కాపీని తీస్కుని భద్రపరచుకోవాలి . అదనంగా, ఏదైనా గందరగోళం లేదా అపార్థాన్ని నివారించడానికి పరీక్ష తేదీ, సమయం మరియు వేదికను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

TS EAMCET పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన వారికి, ఇంకా పీక చివరి అవకాశం ఉంది . ఎంసెట్‌కు అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ అంటే ఈరోజు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతించింది. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారు రూ.5000 లేటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి

గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూ ఉత్తర్వులు..

Share your comments

Subscribe Magazine

More on Education

More