ఈ నెల 16 న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. పరీక్ష నిర్వహణలో తొలిసారి బయోమెట్రిక్(Biometric విధానాన్ని అమలు చేశారు.
ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ తీసుకోవడంతో ఆలస్యం ఏర్పడింది. మొదటిసారి ఇలా బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో ఆయా సెంటర్లో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు.
మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
APPSC AEE Recruitment: AEE పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
TSPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో ఇప్పటికే ప్రాథమిక కీ మరియు OMR జవాబు పత్రాలను విడుదలచిసిన TSPSC త్వరలోనే పరీక్షా ఫలితాలను వెల్లడించనుంది . ఇప్పటికే మీడియా వారాగాల ద్వారా అందిన సమాచారం మేరకు నవంబర్ రెండొవ వారంలో పరీక్షా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నది .
Share your comments