Education

APPSC AEE Recruitment: AEE పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

Srikanth B
Srikanth B
APPSC AEE Recruitment: AEE పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
APPSC AEE Recruitment: AEE పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది , ఇంగినీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది .

అర్హత కల్గిన అభ్యర్థులు AEE పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 26 నుంచి నవంబర్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)

మొత్తం ఖాళీలు : 23

జోన్లవారీగా పోస్టుల కేటాయింపు: జోన్ 1-09, జోన్ 2-05, జోన్ 3-04, జోన్ 4-05.

విభాగాల వారీగా ఖాళీలు:

ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ & శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 13 పోస్టులు

రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 03 పోస్టులు

ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్ (సివిల్ & మెకానికల్): 05

ఏపీ పంచాయత్‌రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 02

వయోపరిమితి:01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి .

Central Tribal University of AP: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు!

రాతపరీక్ష విధానం:

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టులకు (సివిల్ & మెకానికల్) సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-3లో (సివిల్/మెకానికల్) సబ్జెక్టులకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు.

పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

జీతం:నెలకు రూ.57,100 - రూ.1,47,760

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.10.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి .

ఎంపిక విధానం:రాతపరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Central Tribal University of AP: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు!

Share your comments

Subscribe Magazine