Education

TSPSC గ్రూప్ 1 ఫైనల్ కీ నేడు విడుదల .. వారం 10 రోజుల్లో ఫలితాలకు అవకాశం !

Srikanth B
Srikanth B
TSPSC గ్రూప్ 1 ఫైనల్ కీ నేడు విడుదల .. వారం 10 రోజుల్లో ఫలితాలకు అవకాశం !
TSPSC గ్రూప్ 1 ఫైనల్ కీ నేడు విడుదల .. వారం 10 రోజుల్లో ఫలితాలకు అవకాశం !

TSPSC గ్రూప్ 1 ఫైనల్ కీ నేడు విడుదల .. వారం 10 రోజుల్లో ఫలితాలకు అవకాశం !

గ్రూప్ 1 పరీక్షా రాసిన నిరుద్యోగ యువత ఇప్పుడు వేయి కండ్లతో పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తుంది , అక్టోబర్ 29 న ప్రాథమిక కీ ని విడుదల చేయగా నవంబర్ మొదటి వారం వరకు ప్రశ్నలపై అభ్యంతరాలను స్వీకరించింది . ప్రశ్నలపై పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిటీ కొన్ని తప్పుడు ప్రశ్నలను గుర్తించింది అయితే తప్పుడు ప్రశ్నలకు మార్కులను కలపకుండా ప్రశ్నలనే తొలగించాలనే నిరణయానికి వచ్చినట్లు TSPSC అధికారులు తెలిపారు . దీనితో TSPSC GROUP 1 మార్కులు కూడా తగ్గనున్నాయి .

దీనితో అభ్యర్థులలో కటాఫ్ విషయంలో మరింత గందరగోళం నెలకొంది . మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్‌లో 321 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ !

పరీక్ష ఫలితాలు :

పరీక్షా ఫలితాలు కటాఫ్ మార్కుల పై ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చిన TSPSC, కటాఫ్ మెరిట్ ఆధారంగ కాకుండా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో ఖాళీ భర్తీకి 1:50 నిష్పత్తి లో అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు . దీనితో కేటగిరి ప్రకారం కటాఫ్ మార్కులు తగ్గే అవకాశము వుంది మరియు రిజర్వేషన్ ను హారిజాంటల్ గ అమలు చేయాలా లేదా పాత విధానం ప్రకారం భర్తీ చేయాలా నేనే విషయం పైన కూడా వారం పది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది . దీనితో రిజర్వేషన్ అమలుపై స్పష్టత వచ్చిన వెంటనే TSPSC GROUP 1( గ్రూప్ 1 ) ఫలితాలను వెల్లడించనుంది . దీనితో ఫలితాలు ఎపుడనే విషయం పై TSPSC ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు .

డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్‌లో 321 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ !

Related Topics

TSPSC Group1 jobnotification

Share your comments

Subscribe Magazine